తల్లిదండ్రుల మధ్య ఘర్షణకు ఓ నిండు ప్రాణం బలైంది. పుట్టుకతో మూగవాడు కావడం ఆ బాలుడికి శాపమైంది. చివరకు కన్న తల్లిదండ్రులే బాలుడి చావుకు కారణమయ్యారు. అసలేం జరిగిందంటే.. కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లా, దండెలి తాలూకాలో దంపతులు ఘర్షణకు దిగారు. దంపతులకు జన్మించిన బాలుడు జన్మతః మూగవాడు కావడంతో తల్లి సావిత్రి(26) బాలుడిని మొసళ్లు ఉన్న కాలువలో విసిరేసింది.
READ MORE: Lok Sabha Elections 2024: సినీ నటి కంగనా రనౌత్ పై కాంగ్రెస్ మంత్రి విక్రమాధిత్య విమర్శలు
మూగవాడిని ఎందుకు కన్నావ్ అంటూ.. తరచూ భార్యను భర్త రవికుమార్(27) వేధిస్తూ.. ఘర్షణకు దిగేవాడు. బాలుడిని పారేయ్ అని అనేవాడు. శనివారం ఇద్దరి మధ్య గొడవ జరగడంతో ఆమె తన కుమారుడిని తీసుకెళ్లి కాలువలో విసిరేసింది. పోలీసులు ఆదివారం బాలుడి మృతదేహాన్ని గుర్తించారు. మృతదేహంపై తీవ్రమైన గాయాలు, మొసలి కొరికినట్లు గుర్తులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఓ చెయ్యి కూడా కనిపించడం లేదని పేర్కొన్నారు.