Site icon NTV Telugu

Anakapalle : బిగ్‌షాక్.. ఒక బల్బు, టీవీ ఉన్న ఇంటికి రూ.1.60 లక్షల కరెంట్ బిట్లు..

Electricity Bill

Electricity Bill

అనకాపల్లి జిల్లాలో ఓ మధ్య తరగతి కుటుంబానికి విద్యుత్ శాఖ అధికారులు భారీ షాక్ ఇచ్చారు.. ఒక బల్బు, టీవీ ఉన్న ఇంటికి రూ. 1,60,000 కరెంటు బిల్లు వేశారు. భారీగా వచ్చిన కరెంట్ బిల్లును చూసి కుటుంబీకుల గుండె గుబేల్ మంది. జిల్లాలోని రావికమతం మండలం డోలావానిపాలెం గ్రామానికి చెందిన డోలా లక్ష్మి మహిళా ఇంటికి 1.60 లక్షల కరెంట్ బిల్లు వచ్చింది. అదే గ్రామంలో గాది కొండమ్మ ఇంటికి రూ. 29,913 కరెంట్ బిల్లు వచ్చింది.. ఏం చేయాలో పాలుపోక ఆ మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనంతరం వారు విద్యుత్తు శాఖ అధికారులను కలవనున్నారు.

READ MORE: Harish Rao: సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు బహిరంగ లేఖ..

కాగా.. కరెంట్ బిల్లులు ఇంత పెట్టమొత్తంలో రావడం ఇదేం మొదటి సారి కాదు. ఇటీవల అల్లూరు జిల్లా పాత పాడేరులో ఓ పేద గిరిజన కుటుంబానికి కరెంట్‌ బిల్లు షాక్‌ కొట్టింది. కిల్లు బాబూరావుకు చెందిన పెంకుటింటికి ఉచిత విద్యుత్‌ పథకం అమలులో ఉంది. గత నెలలో మైనస్‌ రూ.1,496 విద్యుత్‌ బిల్లు వచ్చింది. ఈ నెలకు కూడా మైనస్‌ విద్యుత్‌ బిల్లు రావాల్సి ఉండగా, ప్లస్‌లో రూ.69,314.91 బిల్లు జారీ అయింది. పెంకుటింట్లో కేవలం రెండు బల్బులు మాత్రమే ఉన్నాయి. అప్పుడప్పుడు టేబుల్‌ ఫ్యాన్‌ వినియోగిస్తారు. ప్రతి నెల 100 యూనిట్ల లోపే మైనస్‌ బిల్లు వస్తోంది.

READ MORE: IND vs ENG : చితక్కొట్టిన ఇంగ్లండ్ బ్యాటర్లు.. భారత్ ముందు భారీ లక్ష్యం

Exit mobile version