Site icon NTV Telugu

Haryana: బట్టల ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు

He

He

హర్యానాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. గురుగ్రామ్‌లోని మనేసర్‌లోని ఓ బట్టల తయారీ యూనిట్‌లో ఈ అగ్నిప్రమాదం సంభవించింది. గత కొద్ది రోజులుగా ఉష్ణోగ్రతలు తీవ్రస్థాయిలో ఉన్నాయి. మరీ మంటలు ఎలా అంటుకున్నాయో.. ఏమో తెలియదు గానీ.. భారీ స్థాయిలో మంటలు ఎగిసిపడ్డాయి. భారీ ఎత్తున పొగ కమ్ముకుంది. చుట్టుప్రక్కల పొగ కమ్ముకుంది.

 

ఫ్యాక్టరీ గ్రౌండ్ ఫ్లోర్, రెండు, మూడో అంతస్తులకు మంటలు వ్యాపించాయి.  ఇక సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని మంటలు అదుపు చేస్తున్నారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరైనా చనిపోయారా? లేదంటే ఆస్తి నష్టం ఎంత జరిగింది అన్నది ఇంకా తెలియలేదు. ఇటీవల గుజరాత్‌లోని రాజ్‌కోట్ గేమింగ్ జోన్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో 28 మంది ప్రాణాలు కోల్పోయారు.

 

Exit mobile version