NTV Telugu Site icon

West Bengal: రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోబోయిన వ్యక్తి.. కాపాడిన ఆర్పీఎఫ్ కానిస్టేబుల్

Train

Train

West Bengal: పశ్చిమ బెంగాల్‌లోని రైల్వే స్టేషన్‌లో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పిఎఫ్) సిబ్బంది ఒక ప్రయాణికుడిని రక్షించింది. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని ఆర్పీఎఫ్ ఇండియా ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. రైల్వే ప్లాట్‌ఫారమ్‌పై నిలబడిన ఓ వ్యక్తి అకస్మాత్తుగా ట్రాక్‌పైకి వచ్చి పడుకున్నాడు. ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు గమనించిన కానిస్టేబుల్ కె. సుమతి ఆ వ్యక్తిని రక్షించడానికి పరుగెత్తుకుంటూ వచ్చింది. దాంతో ఆ వ్యక్తి సురక్షితంగా బయటపడ్డాడు. కానిస్టేబుల్ సుమతితో పాటు మరో ఇద్దరు వచ్చి వ్యక్తి ప్రాణాలను కాపాడారు. ఈ ఘటన పుర్బా మేదినీపూర్ రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకుంది. కొద్ది క్షణాల్లో రైలు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. దీంతో ఆ లేడీ కానిస్టేబుల్ నిర్భయంగా ఆ వ్యక్తిని ట్రాక్‌పై నుండి లాగింది.

Read Also: MLC Jeevan Reddy: అక్కడ ప్రాజెక్టు నిర్మిస్తే కాళేశ్వరం డొల్ల ప్రాజెక్టుగా మిగులుతుంది..

ప్రయాణికుడిని రక్షించిన ఆర్పీఎఫ్ సిబ్బందిని పలువురు ప్రశంసించారు. ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ సుమతీపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. “ఆమె ఉద్యోగం పట్ల గొప్ప అంకితభావం. అభినందనలు.” అని పలువురు అభినందిస్తున్నారు. అంతేకాకుండా ప్రమాదం నుండి కానిస్టేబుల్ త్వరగా స్పందించినందుకు అభినందనలు తెలుపుతున్నారు. హృదయానికి హత్తుకునే సంఘటన అని.. కానిస్టేబుల్ శ్రీమతి సుమతికి అభినందనలు. ధైర్యవంతురాలు అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా ప్రాణాలకు తెగించి కాపాడిన లేడి కానిస్టేబుల్ కె. సుమతీ పదోన్నతి పొందారు. ఏదేమైనప్పటికీ ఆమే ధైర్య సాహసాలకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.