Hyderabad: హైదరాబాద్ పాతబస్తీ మీర్‌చౌక్ ఆఘా కాలనీలో దారుణ హత్య కలకలం రేపుతోంది. ఓ ఇంట్లో షేక్ వాజిద్ అనే వ్యక్తిని నిసార్ అహ్మద్ అనే వ్యక్తి కత్తితో దాడి చేసి హతమార్చాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీం సహాయంతో దక్షిణ మండలం డీసీపీ సాయి చైతన్య, మీర్ చౌక్ ఏసీపీ వెంకటేశ్వర రావు పరిశీలించారు. హత్యకు గల కారణాలు ఆర్థిక లావాదేవీలే అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: Margani Bharat: చంద్రబాబు- పవన్ కళ్యాణ్ కలిసి రాష్ట్రాన్ని మోడీకి తాకట్టు పెట్టాలనుకుంటున్నారు..
మరోవైపు.. 4 లక్షల రూపాయిలు అప్పు తీసుకుని డబ్బు తిరిగి ఇవ్వకపోవడంతో నిందితుడు ఈ హత్యకు పాల్పడినట్లు గుర్తించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు పోలీసులు. కాగా.. ఐపీసీ 302 హత్య కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియల్సిఉందని పోలీసులు వెల్లడించారు. కాగా.. మృతుడు ఫిర్జాదిగూడ వాసిగా పోలీసులు గుర్తించారు.
Read Also: IPL 2024: గుజరాత్ టైటాన్స్‌లోకి గిల్ ఎంట్రీ.. స్టయిలిష్ లుక్‌లో అదిరిపోయాడుగా!