NTV Telugu Site icon

Viral video: అరె అయ్యా..! అది సైకిల్ అనుకున్నావా.. ఏం అనుకున్నావ్..?

9 Children On Cycle

9 Children On Cycle

Viral video: సైకిల్ పై మా అంటే ఎంతమంది కూర్చొవచ్చు.. ముగ్గురు అతి కష్టం మీద ఇంకొకరు.. అదీ చిన్న పిల్లలైతే.. కానీ ఇప్పుడు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఒకడు ఏకంగా తొమ్మిది మందిని ఎక్కించుకుని పోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు చాలా రకాలుగా స్పందిస్తున్నారు. ఈ వీడియోను జైకీ యాదవ్ ట్వీట్ చేశారు.

Read Also: Sanjay Raut comments : వాడిని బహిరంగంగా ఉరితీయాలన్న సీనియర్ నేత

తాజాగా ప్రపంచ జనాభా ఎనిమిది వందల కోట్ల మార్కు దాటింది. ఈ సందర్భంలోనే ప్రస్తుతం వీడియో సందర్భానికి తగ్గట్లు కనిపించడంతో నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోలో ఓ వ్యక్తి తొమ్మిది మంది పిల్లలను ఎక్కించుకుని వెళ్తుంటాడు. ముగ్గురు పిల్లలు సైకిల్ వెనుక కూర్చున్నారు. వారి పై ఒకరు కూర్చున్నారు. ఇక ఇద్దరు పిల్లలు ముందు కూర్చోగా మ‌రొక‌రు ఏకంగా వీల్ టాప్‌పై కూర్చున్నారు. సైకిల్ తొక్కుతున్న వ్యక్తి ఇద్దరు పిల్లలను తన భుజాలపై ఎక్కించుకున్నాడు. ఈ వీడియోను ఇప్పటి వరకు 1.5లక్షల మంది వీక్షించారు.

Read Also: Great Love: 70ఏళ్ల ముసలాడిని ప్రేమించిన 19ఏళ్ల యువతి.. పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో..

ఇంత మంది పిల్లలా అంటూ.. ఓ యూజ‌ర్ కామెంట్‌ చేయగా, బాధ్యత‌గా మెల‌గండి.. వారిలో అవ‌గాహ‌న పెంచే బాధ్యత పాల‌కుల‌దేన‌ని మ‌రో యూజ‌ర్ కామెంట్ చేశారు. ఇది ఆఫ్రికాకు చెందిన వీడియోనని ఇండియాది కాదని నెటిజన్ కామెంట్ చేశారు. అయితే ఈ వీడియో ఎక్కడిదన్న విషయం పై క్లారిటీ లేదు.

Show comments