Site icon NTV Telugu

Heart Attack : ఫ్రెండ్స్‌తో క్రికెట్‌ ఆడుతున్నాడు.. అంతలోనే గ్రౌండ్‌లోనే కుప్పకూలి..

Heart Attack

Heart Attack

గండిపేటలోని బండ్లగూడ జాగీర్‌లో మంగళవారం ఓ వ్యక్తి క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో మృతి చెందాడు. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కు చెందిన తుషార్‌ ఆమ్రా బెద్వా (32) అనే వ్యక్తి హైటెక్‌ సిటీలోని ఓ సంస్థలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అయితే.. తుషార్‌ ఆమ్రా బెద్వా తన తల్లిదండ్రులు, భార్య పూజా బేద్వాతో కలిసి గండిపేటలోని బండ్లగూడ జాగీర్‌లోని రాయల్‌ ఎన్‌క్లేవ్‌లో నివాసం ఉంటున్నాడు. అయితే.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బేద్వా సాయంత్రం 5 గంటల సమయంలో స్నేహితులతో కలిసి తన అపార్ట్‌మెంట్ సమీపంలోని బహిరంగ ప్రదేశంలో క్రికెట్ ఆడేందుకు వెళ్లాడు. ఆడుకుంటుండగా ఛాతిలో నొప్పి రావడంతో మైదానంలో కుప్పకూలిపోయాడు.

అయితే.. ఇది గమనించిన తుషార్‌ ఆమ్రా బెద్వా స్నేహితులు అతన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే.. ఈ మేరకు ఆసుపత్రిలో తుషార్‌ ఆమ్రా బెద్వా చికిత్స పొందుతూ.. మృతి చెందాడని పోలీసులు వెల్లడించారు. అయితే.. తుషార్‌ ఆమ్రా బెద్వా గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు నిర్ధాణించారు. ఆయన మృతిపై కుటుంబ సభ్యులకు ఎలాంటి అనుమానాలు లేవని తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న రాజేంద్రనగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

Exit mobile version