Site icon NTV Telugu

Bengaluru: “ఇది పక్కా ప్లాన్‌” భార్యను ముక్కలు, ముక్కులుగా నరికిన కేసులో ట్విస్ట్..

Bengaluru

Bengaluru

బెంగళూరు దక్షిణ ప్రాంతంలో ఒక షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. హుళిమావు సమీపంలోని దొడ్డకమ్మనహళ్లికి చెందిన రాకేశ్‌ అనే వ్యక్తి తన భార్య గౌరి అనిల్‌ సాంబెకర్‌ (31)ను కిరాతకంగా కడతేర్చిన విషయం తెలిసిందే. ఈ హత్య అనంతరం మృతదేహాన్ని ముక్కలుగా నరికి సూట్‌కేసులో నింపేశాడు. మొదట్లో ఈ ఘటన అనుకోకుండా జరిగిందని అందరూ అభిప్రాయపడ్డారు. కానీ దర్యాప్తులో ఇది పక్కా ప్లాన్‌తో చేసిన హత్య అని తెలుస్తోంది. రాకేష్ తన భార్యను కొట్టి, నోరు మూసి.. మెడ, కడుపులో కత్తితో పొడిచాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఆమె బతికి ఉండగానే ముక్కలుగా నరికి సూట్‌కేస్‌లో పెట్టాడు.

READ MORE: Margani Bharat: గడిచిన నాలుగైదు రోజులుగా రాజమండ్రి అట్టుడికి పోతుంది

వాస్తవానికి.. భార్యాభర్తల మధ్య గొడవ కారణంగా.. నిందితుడు రాకేష్ రాజేంద్ర ఖేడేకర్ తన 32 ఏళ్ల భార్య గౌరీ అనిల్ సాంబ్రేకర్‌ను కత్తితో పొడిచి చంపాడు. గౌరి బతికి ఉండగానే సూట్‌కేస్‌లో పెట్టడానికి ప్రయత్నించాడని, కానీ సూట్‌కేస్ హ్యాండిల్ విరిగిపోవడంతో ఆమెను ఇంటి నుంచి బయటకు తీసుకెళ్లలేకపోయాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. తరువాత మృతదేహాన్ని బాత్రూంలోకి ఈడ్చుకెళ్లాడు. రక్తం సులభంగా కాలువలోకి ప్రవహించేలా నీరు బయటకు పోయే ప్రదేశంలో ఆ సూట్‌కేస్‌ను ఉంచాడు. గౌరిని సూట్‌కేస్‌లో బంధించే వరకు ఆమె బతికే ఉందని ఫోరెన్సిక్ నిపుణులు భావిస్తున్నారు. సూట్‌కేస్‌లో శ్లేష్మం జాడలు కనిపించాయి. ఇది ఆమె చనిపోలేదని సూచిస్తుంది.

READ MORE: Chiyaan : దశాబ్ద కాలం తర్వాత హిట్ కొట్టిన స్టార్ హీరో..

Exit mobile version