Site icon NTV Telugu

Man Dies snake Bite: పొలంలో పామును కొట్టి చంపిన వ్యక్తి.. గంటకే పగ తీర్చుకున్న మరో పాము

Up News

Up News

పాము మరణం తర్వాత పగ తీర్చుకుంటాయని సినిమాలు, కథలలో వినే ఉంటారు. అయితే వాస్తవానికి అలాంటి ఉదంతం యూపీలోని బరేలీ జిల్లా నుంచి వెలుగులోకి వచ్చింది. ఇక్కడ పొలంలోకి వచ్చిన పామును ఓ యువకుడు చంపేశాడు. ఆ యువకుడు పామును దారుణంగా చితకబాదాడు. ఒక గంట తర్వాత.. మరోపాము అతడి చేతికి కాటు వేసింది. ఫలితంగా ఆ వ్యక్తి మరణించాడు. ఈ వార్త తెలియగానే గ్రామంలో గందరగోళం నెలకొంది. ఆ వ్యక్తి ఇంట్లో విషాదఛాయలు అలముకున్నాయి.

READ MORE: Atchannaidu: ఐదేళ్ల అవినీతి చీకట్లు తొలగించిన నవ్యాంధ్ర ప్రజలకీ ఈ దీపావళి ఎంతో ప్రత్యేకమైంది..

విషయం క్యారా ప్రాంతానికి సంబంధించినది. ఇక్కడ నివాసముండే గోవింద్ కశ్యప్ (32) పొలాల్లో కూలీగా పనిచేసేవాడు. మంగళవారం ఉదయం గ్రామ నివాసి అతుల్ సింగ్ పొలంలో వరి కోసిన తర్వాత గడ్డిని సేకరిస్తున్నాడు. ఈ సమయంలో ఓ పాము బయటకు వచ్చింది. పాము పడగ ఎత్తి బుస కొట్టింది. గోవింద్ పామును చూడగానే కర్రతో కొట్టడం ప్రారంభించాడు. పామును బాగా నలిపి చంపాడు. అనంతరం చనిపోయిన పామును వదిలి ఆహారం తినేందుకు వెళ్లాడు. కొంత సేపటికి మరో పాము వచ్చి చచ్చిన పాము దగ్గర వచ్చింది. సుమారు గంట తర్వాత గోవింద్ మైదానానికి తిరిగి రాగా.. ఆ పాము వెంబడించి గోవింద్ చేతికి కాటు వేసి ప్రతీకారం తీర్చుకుంది.

READ MORE:Salman Khan: సల్మాన్ ఖాన్‌కు మళ్లీ ప్రాణహాని.. ఈసారి 2 కోట్లు డిమాండ్!

పాము కాటుకు గురైన గోవింద్ ఇంటి వైపు పరుగెత్తగా.. దారిలో పడిపోయాడు. గోవింద్ నీళ్లు కూడా అడగలేకపోయాడు. గోవింద్‌ని కరిచిన తర్వాత పాము పక్కనున్న పొదల్లోకి వెళ్లింది. సంఘటనా స్థలానికి చేరుకున్న కుటుంబ సభ్యులు నేరుగా వైద్యుడి వద్దకు తీసుకెళ్లగా.. అప్పటికే ఆలస్యం అయింది. పాము కాటు తర్వాత దాని విషం గోవింద్ శరీరమంతా వ్యాపించింది. గోవింద్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. గోవింద్ మృతితో ఇంట్లో గందరగోళం నెలకొంది. అతడిని కాటు వేసిన పాము కోసం గ్రామస్థులు వెతుకుతున్నారు.

Exit mobile version