NTV Telugu Site icon

Viral Video: ముసలోడికి మతి పోయిందా.. ఇలా చేశాడేంటి

Ladder

Ladder

కొన్నిసార్లు కొంతమంది చేసే పనులు చూస్తే.. విపరీతమైన కోపం వస్తుంది. చాలా మంది అనవసరంగా ఇతరులను ఇబ్బంది పెట్టడం మనం చూస్తూ ఉంటాం. ఎలాంటి కారణాలు లేకుండా కొట్టడం, అవమానించడం లాంటివి చేస్తుంటారు. అలాంటప్పుడు వారితో గొడవ పడటానికైనా, కొట్టడానికైనా వెనుకాడరు. ప్రపంచంలో అలాంటి వారు చాలామందే ఉండి ఉంటారు. అయితే ఇప్పుడు ఓ వృద్ధుడి చేసిన తీట పని వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ముసలోడు చేసిన పనికి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ వృద్ధుడు కనీసం నడవడానికి కూడా లేదు. అలాంటిది వీల్‌చైర్‌లో కూర్చుండి ఇలా ప్రాణాలు పోయేంత పని చేశాడు.

Ketika Sharma: ఎద అందాల ఆరబోతకు బ్రాండ్ అంబాసిడర్ ఈ భామే

ఆ వీడియోలో చూస్తే.. 30 అడుగుల ఎత్తులో ఉన్న వ్యక్తిని వీల్‌చైర్‌లో ఉన్న వృద్ధుడు కింద పడేశాడు. దీంతో ఆ వ్యక్తికి తీవ్రంగా గాయాలయ్యాయి. దీంతో అతని పరిస్థితి లేవలేకుండా అయిపోయింది. వృద్ధుడు వీల్‌ఛైర్‌లో మెట్ల దగ్గరికి వచ్చి ఆగినట్లు చూడవచ్చు. ఆ తర్వాత అతను అక్కడ వేసిన నిచ్చెనను బలంగా కదిలిస్తాడు. మొదట్లో ఏం చేస్తున్నాడో అర్థం కాలేదు. ఆ తర్వాత పై నుంచి ఓ వ్యక్తి కిందపడగానే విషయం అర్థమవుతుంది. అక్కడ ఓ పెయింటర్ నిచ్చెనెక్కి గోడకు పెయింటింగ్ వేస్తున్నాడు. దీంతో ఆ వృద్ధుడు నిచ్చెనను బలవంతంగా కదిలించడంతో.. ఆ వ్యక్తి కింద పడ్డాడు.

Telangana : నిజమైన ప్రేమ అంటే ఇదే.. మొక్కకు పుట్టినరోజు వేడుక..

ఈ వీడియోను @crazyclipsonly అనే IDతో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిని 1.4 కోట్ల సార్లు చూశారు.. అంతేకాకుండా 62 వేల మందికి పైగా వీడియోను లైక్ చేశారు. అదే సమయంలో.. వీడియోను చూసిన నెటిజన్లు పలురకాల కామెంట్స్ చేస్తున్నారు. ‘ఇది హత్యాయత్నం’ అని కొందరంటే, ‘ఆ వృద్ధుడిపై కేసు పెట్టి.. జైలులో ఉంచాలి అని మరికొందరు అంటున్నారు.