Site icon NTV Telugu

Viral Video: రోడ్డు దాటేందుకు పాము కష్టాలు.. చప్పట్లు కొడుతూ సాయం

Snake

Snake

పాములను చూస్తే భయపడి వారు ఎంతో మంది ఉన్నారు. కొందరు భయపడకుండా.. వాటితో విన్యాసాలు చేస్తూ సోషల్ మీడియాలో కనిపిస్తారు. మరికొందరైతే పాములు కనపడగానే వెండపడి మరీ చంపుతారు. అయితే ఓ భారీ పాము రోడ్డు దాటేందుకు ఇబ్బందులు పడుతుంటే.. ఓ వ్యక్తి దానికి సహాయం చేస్తాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Read Also: YSRCP: పాదయాత్రే కాదు.. పాకుడు యాత్ర చేసినా.. పొర్లు దండాలు పెట్టినా ఎమ్మెల్యేగా గెలవడు..!

మాములుగా అయితే.. వృద్ధులు, వికలాంగులను రోడ్డు దాటించడం తరచుగా చూస్తూ ఉంటాం. కానీ మధ్యప్రదేశ్‌లోని నర్మదాపురంలో ఓ వ్యక్తి హైవేపై ట్రాఫిక్‌ను నిలిపివేసి పామును రోడ్డు దాటించేందుకు సహాయం చేస్తున్నాడు. మాములుగా అయితే జనాలు రోడ్డుపై పామును చూస్తే.. చంపడానికి ప్రయత్నిస్తారు. కానీ ఈ వ్యక్తి పామును సురక్షితంగా రోడ్డు దాటిస్తున్నాడు. పాముకు సాయం చేసిన వ్యక్తిపై పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Read Also: Anasuya Bharadwaj: గుక్క పెట్టి ఏడుస్తూ వీడియో షేర్ చేసిన అనసూయ.. అసలు ఏమైందంటే?

ఈ వీడియోను నర్మదాపురంలోని భోపాల్-బేతుల్ జాతీయ రహదారిపై SPM రైల్వే బ్లాక్‌ సమీపంలో తీసినట్లు చెబుతున్నారు. రోడ్డుకు ఇరువైపులా ట్రాఫిక్ నిలిచిపోయినట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. అటుగా వెళ్తున్న యువకుడు ఆ పాము రోడ్డుపై దాటడం చూసి.. చప్పట్లు కొడుతూ రోడ్డు దాటేందుకు సహాయం చేశాడు. ఈ సందర్భంగా రోడ్డుకు ఇరువైపులా ట్రాఫిక్ జామ్‌ ఏర్పడింది. ఐతే ఈ వీడియోను రోడ్డుపై వెళ్తున్న కొందరు యువకులు తమ ఫోన్లలో బందించారు. ఈ వీడియోను ‘X’ వేదికగా సోషల్ మీడియాలో Hindustan ఐడీతో పోస్ట్ చేశారు.

 

Exit mobile version