Site icon NTV Telugu

Beer Cans: మద్యం తాగుతూ లక్షాధికారిగా మారిన వ్యక్తి.. ఎలా అంటే..

Beer

Beer

మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరమన్న విషయం అందిరికి తెలిసిందే. మీ శరీరానికి మాత్రమే కాదు, మీ వాలెట్‌ కు కూడా దీని వాళ్ళ ముప్పే. దీంతో అనేక ఆర్థిక సమస్యలు తలెత్తుతున్నాయి. మద్యం వల్ల కుటుంబాలు నాశనమవుతున్నాయనే వార్తలు నిత్యం వింటూనే ఉంటాం. అయితే మద్యానికి బానిసై తలరాత మారిన వ్యక్తి ఉన్నాడని మీకు తెలుసా..? మద్యం సేవించి ధనవంతుడయ్యాడంటే నమ్ముతారా మీరు.? ఇది కొందరికి కొంచెం వింతగా అనిపించవచ్చు. కానీ., ఇది పూర్తిగా నిజం.

Also Read: Gangs of Godavari : విశ్వక్ సేన్ మూవీ నుంచి ‘బ్యాడ్’ థీమ్ సాంగ్ రిలీజ్..

బ్రిటన్ నివాసి అయిన 65 ఏళ్ల నిక్ వెస్ట్ 42 ఏళ్లుగా బీర్ క్యాన్లను సేకరిస్తున్నాడు. ఈ అభిరుచితో నిక్ వెస్ట్ ఇంటిలో 10,300 బీర్ డబ్బాలు పేరుకుపోయాయి. వాటిలో కొన్ని అరుదైన బీర్ క్యాన్లు కూడా ఉన్నాయి. నిక్ వెస్ట్ 16 సంవత్సరాల వయస్సులో స్టాంపులు, మరేదో వస్తువులను సేకరించడం ప్రారంభించాడని అతడు తెలిపాడు. ఈ బీర్ టిన్స్ సేకరించడానికి ఇష్టపడతాడు. ఈ క్రమంలో స్నేహితులతో కలిసి మద్యం సేవించడం అలవాటు చేసుకున్నాడు. క్రమంగా మద్యానికి అలవాటు పడినట్లు తెలిపాడు.

Also Read: Konda Surekha: సిద్దిపేటకు హరీష్‌ రావు అభివృద్ధి చేస్తే.. కేసీఆర్‌ ప్రచారమా?

అయితే బీరు తాగుతూనే.. ఖాళీ బీరు డబ్బాలను ఓ చోట దాచడం మొదలుపెట్టాడు. ఇది అతనికి గొప్ప ఆనందాన్ని కలిగించిందంటూ చెప్పుకొచ్చాడు. ఇలా తన అభిరుచిని కొనసాగించడానికి కొత్త 5 బెడ్ రూమ్స్ ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. కానీ అతను పదవి విరమణ చేసిన తర్వాత, డబ్బు సమస్యలు మొదలయ్యాయి. మరోవైపు ఎక్కడా సరిపడా బీరు బాటిల్స్ పెట్టడానికి స్థలం దొరక లేదు. అందుకే, తాను దాచుకున్న వ్యర్థాల్లో కొంత భాగాన్ని విక్రయించాలని నిర్ణయించుకున్నాడు. మొదటి 6,000 పెట్టెలను విక్రయించగా 13,500 డాలర్స్ వచ్చింది. అంటే అక్షరాలా ఇది రూ. 14 లక్షలు. ఎందుకంటే ఈ బీర్ బాటిల్స్ సంథింగ్ స్పెషల్. ఆ తర్వాత నిక్ వెస్ట్ ఇటలీలోని బీర్ క్యాన్ డీలర్లకు 1,800 టిన్స్ ను విక్రయించాడు. దాంతో అతను 12,500 డాలర్స్ (రూ. 10,43,526) అందుకున్నాడు. నిక్ వెస్ట్ తన వద్ద ఉన్న పురాతన బీర్ 1936 నాటిదని చెప్పాడు.

Exit mobile version