ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో ఓ వ్యక్తి తన భార్యతో గొడవపడి ఇల్లు తగులబెట్టి సజీవ దహనం చేసుకున్న షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ఈ దహనానికి ముందు భార్యపై కూడా పదునైన ఆయుధంతో దాడి చేశాడు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లు, స్థానికులు సహా నలుగురు గాయపడ్డారు. ఖమ్తరాయ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భాన్‌పురి ప్రాంతంతో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడిని బి అమరేశ్వర్‌రావుగా గుర్తించారు.
READ MORE: Group 2 Exam: నేడు, రేపు గ్రూప్ -2 పరీక్షలు.. అరగంట ముందే గేట్లు క్లోజ్!
పోలీసుల సమాచారం ప్రకారం.. సంధ్యారాణి, అమరేశ్వర్‌రావు దంపతులు భాన్‌పురి ప్రాంతంతో నివసిస్తున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొడుకు తండ్రి వద్ద, కూతురు తల్లితో కలిసి ఉంటున్నారు. భర్త కొన్ని రోజులగా ఇంటికి రావడం లేదు. బయట ఉంటూ వారం రోజుల క్రితమే వచ్చాడు. భార్యాభర్తల మధ్య ఏదో విషయమై గొడవ జరగడంతో ఆగ్రహంతో భర్త పదునైన ఆయుధంతో భార్య గొంతు కోశాడు. అనంతరం ఇంటికి నిప్పు పెట్టాడు. తానూ అదే కాలుతున్న ఇంట్లోకి ప్రవేశించాడు. ఈ క్రమంలో సిలిండర్ పేలి వ్యక్తి మృతి చెందాడు.
READ MORE:Gujarat: ఉద్యోగం నచ్చలేదని తన వేళ్లు తానే కోసుకున్న యువకుడు..
సమాచారం అందిన వెంటనే, పోలీసు బృందం ఈ ఘటన స్థలానికి చేరుకుంది. తరువాత గాయపడిన మహిళను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. భర్తను కాపాడేందుకు యత్నించిన ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. వారితో పాటు ఇద్దరు స్థానికులు కూడా స్వల్పంగా గాయపడ్డారు. కేసు నమోదు చేసిన పోలీసులు చర్యలు తీసుకుంటామని తెలిపారు.