NTV Telugu Site icon

Delhi: పార్లమెంటు సమీపంలో.. ఒంటికి నిప్పంటించుకున్న వ్యక్తి.. పరిస్థితి విషమం!

Delhi

Delhi

దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. కొత్త పార్లమెంట్ భవనం సమీపంలో ఓ వ్యక్తి నిప్పంటించుకుని ఆత్మహత్యకు యత్నించాడు. ఆ వ్యక్తి యూపీలోని బాగ్‌పత్ నివాసి అని ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో శరీరం తీవ్రంగా కాలిపోయింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలం నుంచి పెట్రోలు స్వాధీనం చేసుకున్నారు. ఆ వ్యక్తి పరిస్థితి ప్రస్తుతంత విషమంగా ఉన్నట్లు సమాచారం.

READ MORE: Ajay Maken: ఆప్‌‌తో పొత్తు ఒక పొరపాటు.. కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఢిల్లీ అగ్నిమాపక శాఖ (DFS) అధికారి మాట్లాడుతూ.. “పార్లమెంట్ హౌస్ ముందు రైలు భవన్ సమీపంలో ఒక వ్యక్తి పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నట్లు మధ్యాహ్నం 3.35 గంటలకు డిపార్ట్‌మెంట్‌కు సమాచారం అందింది. అనంతరం అగ్నిమాపక దళ వాహనాన్ని సంఘటనా స్థలానికి తరలించాం. పార్లమెంటు సమీపంలో మోహరించిన భద్రతా సిబ్బంది, పలువురు పౌరులు మంటలు ఆర్పారు. అతన్ని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి తరలించారు. ఆ వ్యక్తి యూపీలోని బాగ్‌పత్ నివాసి అని తెలిసింది. అతని పేరు జితేంద్రగా గుర్తించాం. వయసు 30 నుంచి 35 ఏళ్ల మధ్య ఉంటుంది. జితేంద్ర శరీరం 90 శాతం కాలి పోయింది. ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్‌లో అతనిపై నమోదైన కేసు కారణంగా అతను కలత చెందాడని దర్యాప్తులో తేలింది. ఎలాంటి సూసైడ్ నోట్ లభ్యం కాలేదు.” అని తెలిపారు.

READ MORE: Health: నల్ల జీలకర్ర గురించి లాభాలు తెలుసా..? ఈ సమస్య ఉన్న వారు వాడండి

కాగా.. క్రిస్మస్, న్యూ ఇయర్ సందర్భంగా ఢిల్లీలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉన్న తరుణంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. రద్దీగా ఉండే ప్రాంతాల్లో పోలీసు భద్రతను పెంచారు. పోలీసు బృందాలు నిరంతరం గస్తీ తిరుగుతున్నాయి. వాహనాల సోదాలు కూడా ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.

Show comments