NTV Telugu Site icon

Burnt Car: ప్రియురాలిపై కోపంతో బెంజ్ కారు తగలబెట్టిన ప్రియుడు

Burnt Car

Burnt Car

Burnt Car: ప్రియురాలిపై కోపంతో ప్రియుడు బెంజ్ కారు తగలబెట్టిన ఘటన తమిళనాడులో కాంచీపురం జిల్లాలో చోటుచేసుకుంది. తమిళనాడులోని కాంచీపురం జిల్లా రాజకులం వద్ద ఈ ఘటన జరిగింది. ధర్మపురికి చెందిన డాక్టర్ కవిన్, కావ్య మధ్య గత కాలంగా ప్రేమించుకుంటున్నారు. గురువారం కాంచీపురం వద్ద కారులో మాట్లాడుతుండగా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో కవిన్‌ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఆ కోపంలోనే బెంజ్ కారుపై పెట్రోలు పోసి నిప్పు అంటించాడు. దాదాపు రూ.70 లక్షల విలువైన బెంజ్‌ కారు పూర్తిగా ఖాలిపోయింది.

Ukraine Crisis: ఉక్రెయిన్‌పై ఆగని రష్యా దాడులు.. 11 మంది మృతి

చెరువు సమీపంలో కారు కాలిపోతున్నట్లు గమనించిన స్థానికులు అగ్నిమాపక శాఖ, పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. కానీ, అప్పటికే కారు పూర్తిగా దగ్ధమైంది. తాలూకా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. కారు ధర్మపురి జిల్లాకు చెందిన కవిన్ అనే వ్యక్తికి చెందినదని తేలింది.

Show comments