NTV Telugu Site icon

Poonam Pandey : బతికే ఉన్న పూనమ్ పాండే.. ఆమె ఎందుకు ఇలా చేసిందంటే ?

Whatsapp Image 2024 02 03 At 12.48.09 Pm

Whatsapp Image 2024 02 03 At 12.48.09 Pm

Poonam Pandey : బాలీవుడ్ బోల్డ్ హీరోయిన్ పూనమ్ పాండే మరణవార్తతో సినీ పరిశ్రమ షాక్ కు గురైంది. ఆమె మరణ వార్త విన్న హార్ట్ కోర్ అభిమానులంతా విషాదంలో మునిగిపోయారు. పూనమ్ 32 ఏళ్ల వయసులో గర్భాశయ క్యాన్సర్‌తో మరణించింది. ఈ విషయాన్ని ఆమె మేనేజన్ ఇన్ స్టాలో ధృవీకరించారు. అయితే ఈ విషయంలో ఇప్పుడు ఓ ఆశ్చర్యకరమైన విషయం వెలుగులోకి వచ్చింది.

Read Also:Sankranthi 2025: వచ్చే ఏడాదికి పోటి పడబోతున్న స్టార్ హీరోలు వీరే..

పూనమ్ పాండే చనిపోలేదు. ఈ విషయాన్ని ఆమె మాట్లాడిన వీడియోను స్వయంగా ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. తాను ఎందుకు ఇలా చేయాల్సి వచ్చిందో ఆ వీడియోలో చెప్పుకొచ్చింది. సర్వైకల్ క్యాన్సర్ ను లైమ్ లైట్ లోకి తీసుకు వచ్చేందుకు ఇలాంటి పని చేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది. ఇది ఇలా ఉంటే పూనమ్ చనిపోయిందన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అయినప్పటి నుంచి రకరకాల ఊహాగానాలు తెరపైకి వచ్చాయి.

Read Also:MLC Kavitha: నిజామాబాద్ నుంచి పోటీ చేయాలా లేదా చెప్పండి..

పూనమ్ మరణ వార్త వెలుగులోకి వచ్చినప్పటి నుండి ఆమె కుటుంబం అజ్నాతంలోకి వెళ్లింది. కుటుంబ సభ్యులకు ఫోన్ చేసేందుకు ఎవరు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. అయితే అందరి ఫోన్లు స్విచ్ ఆఫ్లో ఉన్నాయని చెబుతున్నారు. పూనమ్ మరణ వార్తను విన్న కొందరు నెటిజన్లు చనిపోలేదని మొదటి నుంచి చెబుతూనే ఉన్నారు. ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అని ఆగ్రహిస్తున్నారు. తాను బతికే ఉందన్న విషయం తెలిసిన మరుక్షణమే అరెస్ట్ చేయాలని కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు.