NTV Telugu Site icon

Mangalavaaram : భారీ మొత్తానికి మంగళవారం మూవీ డిజిటల్ రైట్స్ కొనుగోలు చేసిన ప్రముఖ ఓటీటీ సంస్థ..?

Whatsapp Image 2023 11 17 At 11.39.15 Am

Whatsapp Image 2023 11 17 At 11.39.15 Am

హాట్ బ్యూటి పాయల్ రాజ్‌పుత్ నటించిన లేటెస్ట్ మూవీ మంగళవారం.. ‘ఆర్ఎక్స్ 100’, ‘మహాసముద్రం’ చిత్రాల తర్వాత అజయ్ భూపతి దర్శకత్వం వహించిన ఈ మూవీలో పాయల్ రాజ్‌పుత్‌ తో పాటు ‘రంగం’ ఫేమ్ అజ్మల్ అమీర్, నందిత శ్వేత, దివ్య పిళ్లై, రవీంద్ర విజయ్, అజయ్ ఘోష్, శ్రీ తేజ్ మరియు శ్రవణ్ రెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషించారు.మంగళవారం చిత్రానికి అజయ్ భూపతి ‘A’ క్రియేటివ్ వర్క్స్ నిర్మాణ సంస్థ భాగస్వామి కాగా ముద్ర మీడియా వర్క్స్ పతాకం పై స్వాతి రెడ్డి గునుపాటి మరియు సురేష్ వర్మ నిర్మించారు. ట్రైలర్ తో సినిమా పై అంచనాలు పెంచేసిన మంగళవారం మూవీ ఇవాళ అంటే నవంబర్ 17 న థియేటర్ల లో ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.విడుదలయినా మొదటి షో నుంచే మంగళవారం సినిమా కు పాజిటివ్ టాక్ వస్తోంది.

సినిమాలో పాయల్ నటన అద్భుతం గా ఉన్నట్లు సమాచారం.మిక్స్ డ్ జోనర్‌ లో తెరకెక్కిన మంగళవారం సినిమా లో హారర్, సస్పెన్స్, థ్రిల్లర్ అంశాలు ఉన్నాయని రివ్యూలు చెబుతున్నాయి. ముఖ్యంగా యూత్‌ కు మంగళవారం మూవీ ఎంతగానో నచ్చుతుంది. సినిమా లో బోల్డ్ సీన్స్ యూత్ ని ఆకట్టునేలా ఉన్నాయని తెలుస్తుంది.ఇదిలా ఉంటే శుక్రవారం విడుదలైన మంగళవారం మూవీ ఓటీటీ స్ట్రీమింగ్, డీల్ ఆసక్తి రేకెత్తిస్తుంది..మంగళవారం సినిమా డిజిటల్ రైట్స్ ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా సొంతం చేసుకుందని సమాచారం.ఆహా సంస్థ భారీ మొత్తానికి మంగళవారం మూవీ డిజిటల్ రైట్స్ కొనుగోలు చేసినట్లు టాక్ వస్తోంది. ఇక మంగళవారం సినిమా ను ఓటీటీ లోకి థియేట్రికల్ రిలీజ్ తర్వాత 40 రోజుల కు, లేదా డిసెంబర్ రెండో వారం లో తీసుకురానున్నట్లు సమాచారం. ఒకవేళ కలెక్షన్స్ బట్టి మంగళవారం ఓటీటీ రిలీజ్ డేట్‌ లో మార్పులు జరిగే అవకాశం కూడా ఉన్నట్లు సమాచారం..