మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో హృదయ విదారకమైన హత్య ఘటన వెలుగు చూసింది. ఇక్కడ ఓ భర్త తన భార్యపై అనుమానంతో ఆమెను హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని ఆటో రిక్షాలో డంప్‌యార్డుకు తీసుకెళ్లి కిరోసిన్ పోసి తగులబెట్టాడు. మహిళ కనిపించకుండా పోవడంతో ఆమె తల్లిదండ్రులు నిందితులపై కేసు పెట్టారు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన మే 21 న జరిగింది.
READ MORE: Nirmal: రిటైర్డ్ ఉద్యోగి ఖాతాలో జీతం జమ..తిరిగి తీసుకోవాలని అధికారులకి లేఖ
నిషత్‌పురా పోలీస్ స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్ MD అహిర్వార్ తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలు రేష్మా, నిందితుడు శుభమ్ చౌదరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ కారణంగానే మురళీనగర్‌లోని వారి ఇంట్లో తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది. తన భార్య వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని అనుమానిస్తున్నట్లు హత్య నిందితుడు నదీమ్ ఉద్దీన్ పోలీసులకు తెలిపాడు. మే 21న భార్యకు మొబైల్‌కు ఫోన్ చేసి కరోండ్ కూడలికి రావాల్సిందిగా కోరాడు. ఆమె అతన్ని కలవడానికి రాగానే, అతను ఆమె మొబైల్ ఫోన్ తీసుకున్నాడు. అందులోని ఓ వీడియో చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. వేరే వ్యక్తితో కలిసి చేసిన ఓ ఇన్ స్టాగ్రామ్ రీల్ అందులో కనిపించింది. అనంతరం అక్కడే భార్యను గొంతుకోసి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని ఆటో రిక్షాలో 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ చెత్త కుప్పపై కిరోసిన్ పోసి తగులబెట్టారు. దీని తర్వాత సగం కాలిన మృతదేహాన్ని మట్టిలో పూడ్చిపెట్టారు. నేరం జరిగిన ప్రదేశంలో మహిళ మృతదేహం 14 ముక్కలుగా కనిపించింది. నిందితుడిని నదీమ్ ఉద్దీన్‌గా గుర్తించారు. 22 ఏళ్ల బాధితురాలి సగం కాలిపోయిన కొన్ని శరీర భాగాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విచారణ నిమిత్తం వారిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు తరలించారు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
READ MORE: UP: ఉత్తర్ ప్రదేశ్ లో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 3.9 నమోదు
భార్యను హతమార్చి దోపిడీకి యత్నించారిన తప్పుడు కథనం సృష్టించేందు యత్నం..
తొలుత శుభమ్ చౌదరి, అతని భార్య రేష్మా చౌదరి పై దోపిడీ, దాడి జరిగినట్లు పోలీసులకు సమాచారం అందింది. తన ఏడాదిన్నర కుమారుడు, భార్యతో తన అత్తమామల ఇంటికి వెళ్తుండగా.. దారిలో బైక్‌పై వెళ్తున్న కొందరు అతడి వాహనంపై రాళ్లు రువ్వి దోపిడీకి పాల్పడ్డారని నమ్మించేందుకు యత్నించాడు. వారు అతని భార్యను చంపారని పోలీసులకు తెలిపాడు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు శుభమ్ ను అనుమానించి.. సీసీటీవీ ఫుటేజీలు పరిశీలించారు. అంనంతరం నిందితుడిని విచారించగా.. అసలు విషయం బయటపడింది.