Murder : జూనియర్ ఆర్టిస్ట్ హత్య.. భర్తే చంపి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినిమా ఆర్టిస్టు హత్యకు గురయ్యారు. ఆర్టిస్ట్ ని చంపేసి ఆత్మహత్యగా భర్త చిత్రీకరించే ప్రయత్నం చేశారు చివరికి కూతురు ఇచ్చిన ఫిర్యాదుతో హత్య ఉదంతం వెలుగులోకి వచ్చింది.. జూనియర్ ఆర్టిస్ట్ అనురాధ ను హత్య భర్త చేసి పారిపోయాడు. పరారీలో భర్త శివరామయ్య కోసం నాలుగు బృందాలు గాలిస్తున్నాయి. చిత్ర పరిశ్రమలో జూనియర్ ఆర్టిస్టుగా పనిచేసిన 36 సంవత్సరాల మహిళను అతని భర్త గొంతు నులిమి చంపాడు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని మల్లికార్జున కాలనీకి చెందిన మద్దూరి అనురాధ (36) హత్యకు గురైనట్లు పట్టణ సీఐ విజయ్ కుమార్ తెలిపారు. మల్లికార్జున కాలనీలో నివాసం ఉంటున్న మద్దూరి అనురాధ, శివరామయ్య దంపతులు తరచుగా గొడవపడేవారని వివరించారు. చిత్ర పరిశ్రమలో జూనియర్ ఆర్టిస్టుగా పనిచేసిన అనురాధ పై భర్త శివరామయ్య అనేక అనుమానాలు వ్యక్తం చేసేవాడని ఈ విషయంలో అనేక గొడవలు జరిగేవని కూతురు నందిని ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నట్టు తెలిపారు.
Ruhani Sharma: వామ్మో, రుహానీ ఏంటి ఇలా చేసింది.. వీడియోలు వైరల్!
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
సోమవారం ఉదయం 9 గంటల సమయంలో కూతురు నందిని కి ఫోన్ వెళ్ళిందని తల్లి అనురాధ ఆత్మహత్య చేసుకున్నట్టు తండ్రి ఫోన్ చేశాడని, బంధువులు అందరూ వచ్చి చూసే వరకు తన తండ్రి శివరామయ్య లేడని పేర్కొన్నారు. ఫ్యానుకు చీర కట్టి ఉందని శవం మాత్రం బెడ్ రూమ్ లో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. అయితే అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు ఆమె మృతదేహాన్ని పరిశీలించగా గొంతు నిలిమి చంపిన ఆనవాళ్లు కనిపించాయని పేర్కొన్నారు. దీనికి తన తండ్రి శివరామయ్య కారణమని తన తల్లిని హత్య చేసినట్టు కూతురు నందిని పోలీసులకు ఫిర్యాదు చేయగా, దీనిపై హత్యకేసు నమోదు చేసి దర్యాప్తు జరుగుతున్నట్లు సీఐ విజయకుమార్ తెలిపారు. నిందితున్ని గాలించేందుకు ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేసినట్టు సీఐ తెలిపారు.
Minister Savitha: గుడ్‌న్యూస్.. ఏపీలో త్వరలో నూతన టెక్స్టైల్, అపెరల్, గార్మెంట్స్ పాలసీ
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!