NTV Telugu Site icon

31st December: న్యూ ఇయర్ ఎఫెక్ట్.. భారీగా కండోమ్స్‌ అమ్మకాలు..

Condom

Condom

న్యూయర్ రోజు తమకు ఇష్టమైన వారితో సంతోషంగా గడపాలని అందరు అనుకుంటారు.. పాత సంవత్సరాన్ని పంపించి కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టాలని చాలా మంది అనుకుంటారు.. పాత ఏడాదికి వీడ్కోలు పలుకుతూ న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌ గట్టిగా చేసుకున్నారు. డిసెంబర్‌ 31న జరిగిన అమ్మకాలు చూస్తేనే ఏ రేంజ్‌లో వేడుకలు జరిగాయో అర్థమవుతోంది.. భారీగా చికెన్ అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది. రెస్టారెంట్లకు కూడా పెద్ద ఎత్తున ఆర్డర్లు వచ్చాయి. ఎప్పటి లాగానే మద్యం అమ్మకాలు రికార్డు స్థాయిలో జరిగాయి. ఇక బార్లు, పబ్బులు ప్రజలతో కిటకిటలాడాయి.

READ MORE: Keeravani: ఇళయరాజా సంగీత దర్శకత్వంలో కీరవాణి రాసిన పాట..విన్నారా?

ఇదిలా ఉండగా.. కొత్తేడాదికి ఆహ్వానం పలికే సమయంలో హైదరాబాద్‌లో బిర్యానీలతో పాటు, కండోమ్స్‌ అమ్మకాలు సైతం భారీగా పెరిగినట్లు ప్రముఖ ఫుడ్‌ డెలివరీ యాప్‌ ‘స్విగ్గీ ఇన్‌స్టామార్ట్’ తెలిపింది.. నిన్న (మంగళవారం) సాయంత్రం 5.30 వరకు 4,779 కండోమ్స్ ప్యాకెట్లు బుక్ చేసినట్లుగా స్విగ్గీ తెలిపింది. అదేవిధంగా వాటితో పాటు రాత్రి 7.30 వరకు 2.21 లక్షల చిప్స్ ప్యాకెట్లు ఆర్డర్ పెట్టినట్లు కంపెనీ వెల్లడించింది. అయితే.. మంగళవారం రాత్రి వచ్చిన ఆర్డర్లలో ప్రతి ఎనిమిది మందిలో ఒకటి ఇతరుల కోసం ఆర్డర్ చేసినవని కంపెనీ తెలిపింది. ఈ తరహా ఆర్డర్లు మదర్స్‌ డే, వాలెంటైన్స్ డేలను కూడా అధిగమించాయని ‘స్విగ్గీ ఇన్‌స్టామార్ట్’ పేర్కొంది.

READ MORE: Tarakka Sidam: సీఎం ఎదుట లొంగిపోయిన మావో అగ్ర నేత మల్లోజుల వేణు భార్య

Show comments