NTV Telugu Site icon

Delhi Fire Accident: ఢిల్లీ ముండ్కాలోని ఎల్‌ఈడీ లైట్ల ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం..

Fire Accident

Fire Accident

దేశ రాజధాని ఢిల్లీలో అగ్ని ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. రోజుకో చోట అగ్ని ప్రమాదం జరుగుతుంది. తాజాగా.. ముండ్కా ప్రాంతంలోని ఎల్ఈడీ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. దీంతో.. 40 ఫైరింజన్లు ఘటనా స్థలానికి చేరుకుని.. మంటలను అదుపు చేస్తున్నాయి. ఈ ప్రమాద ఘటనపై.. చీఫ్ ఫైర్ ఆఫీసర్ వీరేంద్ర సింగ్ మాట్లాడుతూ, ‘ఉదయం 7 గంటల ప్రాంతంలో చెత్తకు నిప్పంటుకున్నట్లు తమకు ఫోన్ వచ్చిందని తెలిపారు. దీంతో.. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నామని అన్నారు. అప్పటికే.. ఫ్యాక్టరీలో మంటలు భారీగా చెలరేగాయని పేర్కొన్నారు.

Delhi Water Crisis: ఢిల్లీలో నీటి కోసం ఘర్షణ.. ముగ్గురికి గాయాలు

వెయ్యి చదరపు మీటర్ల విస్తీర్ణంలో మంటలు వ్యాపించాయని.. అది గ్రౌండ్ ప్లస్ మూడంతస్తుల భవనం అని తెలిపారు. మంటలు ఇంకా చెలరేగుతూనే ఉన్నాయని అన్నారు. ఫ్యాక్టరీ అన్ని వైపుల నుండి మూసివేయడం వలన.. తాము లోపలికి ప్రవేశించడానికి ఇబ్బంది పడుతున్నామని పేర్కొన్నారు. ఫ్యాక్టరీ మొత్తం భారీ పొగలతో కమ్ముకుందని అధికారి తెలిపారు.

GHMC Official Transferred: కూల్చివేతలో భాగంగా అధికారిపై బదిలీ వేటు..

మంటలను ఆర్పేందుకు లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నామని.. ఈ క్రమంలో.. జేసీబీతో కొంత భాగాన్ని కూల్చివేసి లోపలికి వెళ్లనున్నట్లు తెలిపారు. అయితే.. అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి.. మంటలు ఎలా అంటుకున్నాయని ఇంకా తెలియరాలేదు. ఫ్యాక్టరీలో ఎంత మేర నష్టం జరిగిందో తెలియాల్సి ఉందని అగ్నిమాపక అధికారి తెలిపారు. మంటలార్పిన తర్వాత వివరాలు తెలుస్తాయని ఆయన చెప్పారు.