NTV Telugu Site icon

Fire Accident: ముంబైలో భారీ అగ్ని ప్రమాదం.. స్పాట్‌కు 10 ఫైరింజన్లు (వీడియో)

Mumbai Fire Accident

Mumbai Fire Accident

ముంబైలో ఆదివారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. వర్లీ ప్రాంతంలోని అన్నీ బిసెంట్ రోడ్డులోని అట్రియా మాల్ ఎదురుగా ఉన్న పూనమ్ ఛాంబర్స్ భవనంలో భారీగా మంటలు చెలరేగాయి. అగ్ని ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. వెంటనే 10 ఫైరింజన్లతో ఘటనాస్థలికి చేరుకున్నాయి. అనంతరం.. అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఏడంతస్తుల వాణిజ్య భవనంలోని రెండో అంతస్తులో మంటలు వ్యాపించినట్లు సమాచారం. మంటలు ఇతర అంతస్తులకు వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, బెస్ట్ అధికారులు, అంబులెన్స్‌లు అందరూ సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ప్రస్తుతానికి ఈ ఘటనలో ఎవరికేమీ ప్రమాదం కాలేదు. కాగా.. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ప్రమాద ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read Also: Raj Kapoor: పాకిస్థాన్‌లో ప్రముఖ బాలీవుడ్ నటుడి శత జయంతి వేడుకలు…

ఈ ఘటనపై మహారాష్ట్ర మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే ఆదిత్య ఠాక్రే మీడియాతో మాట్లాడుతూ, “అగ్నిప్రమాదం జరిగింది. ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పడానికి తమ ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు.” అని అన్నారు.

Show comments