ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బరాఖంబా రోడ్డులోని గోపాల్ దాస్ భవనంలో మంటలు చెలరేగాయి. 8వ అంతస్తులో మంటలు ఎగిసిపడుతున్నాయి. వెంటనే సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నాయి. మరోవైపు.. మంటల కారణంగా ఆ ప్రాంతమంతా పొగలు వ్యాపించాయి. అయితే అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. మధ్యాహ్నం 1 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. అగ్నిప్రమాదం సంభవించడంతో భవనంలో ఉన్న వారిని పూర్తిగా ఖాళీ చేయించారు అధికారులు. కాగా.. ఈ భవనంలో చాలా కార్యాలయాలు ఉన్నాయి.
Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. బరాఖంబాలోని 8వ అంతస్తులో ఎగిసిపడుతున్న మంటలు

Delhi Fire