NTV Telugu Site icon

Karimnagar: సుఖాంతమైన పాప కథ.. ఏడేళ్ల తర్వాత తల్లి ఒడికి చేరిన బాలిక

Karimnagar

Karimnagar

Karimnagar: డా.బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా(తూర్పు గోదావరి జిల్లా) సఖినేటి పల్లి మండలం అంతర్వేదిలో అక్ష అనే చిన్నారి 2016లో తండ్రితో పాటు కనిపించకుండా పోయింది. దీంతో తల్లి ద్వారక అప్పట్లోనే సఖినేటిపల్లి పీఎస్ లో తన కూతురు తప్పిపోయిందని ఫిర్యాదు చేసింది. దీంతో తప్పి పోయిన కూతురుకోసం అప్పటి నుంచి తల్లి వెతుకుతూనే ఉంది. ఎక్కడెక్కడో తిరిగి చిన్నారి అక్ష కరీంనగర్ కు చేరుకుంది. సైదాపూర్ మండలంలో భాగ్యలక్ష్మి అనే మహిళ ఆ పాపను దగ్గరకు తీసింది. ఆమె దగ్గర పాప అనుమానస్పదంగా కనిపించడంతో పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు.

Read Also:BJP vs Congress: మాకు 150 సీట్లు వస్తాయని రాహుల్ కామెంట్స్.. అంత సీన్ లేదన్న సీఎం

చిన్నారిని పోలీసులు ఆమె దగ్గరనుంచి తీసుకొచ్చి కరీంనగర్ లోని బాల రక్షా భవన్ కు అప్పగించారు. పాప ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చూసి తమ బిడ్డే అంటూ ఇటీవల వేరువేరు ప్రాంతాల నుంచి ఇద్దరు వ్యక్తులు వచ్చారు. వారిలో పద్మ అనే మహిళ తన మనవరాలేనంటూ ఆధారాలు చూపించడంతో శిశు సంక్షేమ శాఖ అధికారులు విచారణ చేపట్టారు. పద్మ చెప్పింది నిజమేనని నిరూపించుకున్న తర్వాత పాప తల్లి ద్వారకను అధికారులు పిలిపించారు.తనతో గొడవపడి భర్త రవి పాపని తీసుకొని వెళ్ళిపోయాడని ద్వారక అధికారులకు చెప్పింది. పాప కోసం అదే సమయంలో ద్వారక భర్త రవి కూడా రావడంతో.. చిన్నారి సమక్షంలోనే విడిపోయిన భార్యభర్తలు కలుసుకున్నారు. అన్ని ఆధారాలు ధ్రువీకరించుకున్న తర్వాత పాపను తల్లిదండ్రులకు అధికారులు అప్పటించారు.

Read Also:Allu Sirish: బన్నీ బ్రదర్.. మరో రీమేక్.. ?