NTV Telugu Site icon

CP Sudheer Babu: డబల్ బెడ్ రూమ్ ఫ్లాట్స్ ఇప్పిస్తామని మోసం చేస్తున్న ముఠా అరెస్ట్‌

Cp Sudheer Babu

Cp Sudheer Babu

డబల్ బెడ్ రూమ్ ఫ్లాట్స్ ఇప్పిస్తామని మోసం చేస్తున్న ముఠా అరెస్ట్‌ చేశారు రాచకొండ పోలీసులు. ఈ సందర్భంగా రాచకొండ సీపీ సుధీర్ బాబు మాట్లాడుతూ.. 6 గురితో కూడిన ముఠాను అరెస్ట్ చేసామని వెల్లడించారు. మొత్తం 3 రకాల నేరాలు చేశారని ఆయన తెలిపారు. డబల్ బెడ్ రూమ్ ఫ్లాట్స్ ఇప్పిస్తామని మోసం చేశారని, హర్షిణి రెడ్డి అనే మహిళ ఫేక్ లెటర్ లు, స్టాంపు లతో సహా క్రెయేట్ చేసిందని, A1 సురేందర్ రెడ్డి క్రికెట్ బెట్టింగ్‌లో పెట్టుబడి పెట్టారన్నారు సీపీ సుధీర్‌ బాబు. గురుకుల పాఠశాలల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని కొందరిని మోసం చేశారని, గురుకుల పాఠశాలల కార్యదర్శిని కలిసి.. వేం నరేందర్ రెడ్డి పేరు చెప్పి బురిడీ కొట్టించారన్నారు సీపీ సుధీర్‌ బాబు. ప్రభుత్వ పెద్దల పేరుతో బదిలీల విషయంలోనూ గురుకుల అధికారులను మోసం చేశారని ఆయన తెలిపారు. ఉద్యోగం కోసం వెళ్లి ప్రిన్సిపాల్ ను బుట్టలోకి దింపారని, వసూళ్లు చేసిన డబ్బులను బెట్టింగ్ లలో పెడుతోంది ముఠా అని ఆయన తెలిపారు. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లో ఉద్యోగాలు ఇప్పిస్తామని కొందరితో డబ్బులు వసూలు చేశారని, మొత్తం ఈ ముఠా చేతిలో 108 మంది బాధితులు ఉన్నారని ఆయన తెలిపారు. సురేందర్ పై గతంలో బెట్టింగ్ కేసులు కూడా ఉన్నాయని, ఏకంగా.. ముఠా లోని సభ్యులు వేం నరేందర్ రెడ్డి లా మాట్లాడి మరీ మోసాలకు పాల్పడ్డారని ఆయన తెలిపారు.

Cylinder Blast: స్కూల్‌లో పేలిన సిలిండర్‌.. విద్యార్థులకు తృటిలో తప్పిన ప్రమాదం

అంతేకాకుండా..’మరీనా రోజ్ అనే మహిళ ఖాతాల్లో డబ్బులు డిపాజిట్ చేశారు… అంజయ్య, వెంకటేష్, గోపాల్ నాయక్ ను అరెస్ట్ చేశాం… ఒక్క చర్లపల్లి పరిధిలోనే 98 మందిని మోసం చేశారు.. స్టాంపులు, సర్టిఫికెట్ లు తయారు చేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకుంటాం.. అమాయక ప్రజలే టార్గెట్ గా ముఠా మోసాలకు పాల్పడిందని ఆయన తెలిపారు. నిందితుల దగ్గర నుంచి లక్ష 97 వేలు, 8 మొబైల్స్ సీజ్ చేసాం.. ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి అనుచరుడిని అంటూ మోసాలు చేస్తున్న గ్యాంగ్ అరెస్ట్ చేశాం. ఆరుగురు ముఠా సభ్యులను మల్కాజ్గిరి కీసర పోలీసులు అరెస్ట్ చేశారు. కుషాయిగూడకు చెందిన ఏనుగు సురేందర్ రెడ్డి ప్రధాన నిందితుడు అని, గురుకుల సెక్రటరీ అలుగు వర్షిణి కి ఫోన్ చేసిన నిందితుడు సురేందర్ రెడ్డి.. వేం నరేందర్ రెడ్డి గా పరిచయం చేసుకుని ట్రాన్స్ఫర్లు చేయాలనీ బురిడీ కొట్టించే ప్రయత్నం చేశాడు… నిందితుడి మోసాన్ని పసిగట్టింది ఐఏఎస్ అధికారిని.. అయితే.. ప్రభుత్వ ఉద్యోగుల ట్రాన్స్ఫర్లు, డబల్ బెడ్ రూమ్ లు ఇప్పిస్తామని పైసా వసూల్ చేయడం.. దాదాపు రూ. 1.29 కోట్ల డబ్బు వసూల్‌ చేశారు కేటుగాళ్లు. బాధితుల దగ్గర వసూల్‌ చేసిన డబ్బును ముఠా క్రికెట్ బెట్టింగ్‌లో పెట్టినట్లు గుర్తించారు పోలీసులు. 98 మంది దగ్గర డబల్ బెడ్ రూమ్ పేరుతో డబ్బులు వసూల్‌ చేశారు. 7 గురుకి ఉద్యోగాల ట్రాన్స్ఫర్లు పేరుతో మోసం చేశారు. ఇద్దరికీ ఫుడ్ కార్పొరేషన్ లో ఉద్యోగం ఇప్పిస్తామని గ్యాంగ్ మోసం చేసినట్లు విచారణలో తేలిందని సీపీ వెల్లడించారు. మొత్తం 107 మంది దగ్గర వివిధ పేర్లతో ఈ గ్యాంగ్‌ డబ్బులు వసూలు చేసినట్లు, నిందితులు సురేందర్ రెడ్డి, మెరీనా రోస్, అంజయ్య, వెంకటేష్, గోపాల్ నాయక్, హర్షిని రెడ్డి లు అరెస్ట్ చేసినట్లు సీపీ సుధీర్‌ బాబు తెలిపారు.

Nepal: బస్సు ప్రమాదంలో 14 మంది భారతీయుల మృతి.. నేపాల్లో తరచూ ప్రమాదాలకు కారణాలివే..