రోడ్డు పక్కన టీ తాగుతున్నారా.. తస్మాత్ జాగ్రత్త. పని ఒత్తిడితో కాస్త రిలాక్స్ కావడం కోసం టీ తాగుతుంటారు. టీ తాగడం వల్ల మైండ్ రిఫ్రెష్ అవుతుందని.. వేడి వేడిగా గుంజుతుంటారు. అయితే.. ఈ భయంకరమైన కథనం వింటే.. మీరు రోడ్డు పక్కన టీ తాగడమే మానేస్తారు. అధికారులు చేసిన సోదాలు ఈ భయంకరమైన విషయాలను వెలుగులోకి తీసుకొచ్చాయి. నగరంలో టీ దుకాణాలకు తక్కువ ధరకు కల్తీ టీ పొడి సరఫరా చేస్తున్న ముఠాను పట్టుకున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు.
Read Also: History Of Tata Indica : ఇండికా కారుతో రతన్‌టాటాకి ఎమోషనల్ బాండింగ్!
కల్తీ టీ పొడి తయారు చేసి దుకాణాలకు విక్రయిస్తున్న ముగ్గురు కల్తీ రాయుళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. బాలానగర్ లోని ఫతేనగర్ కు చెందిన జగన్నాథ్ అనే వ్యక్తి కోణార్క్ టీ పౌడర్స్ సేల్స్ సప్లై పేరిట వ్యాపారం చేస్తున్నాడు. నాసిరకం టీ పొడిని కిలో రూ. 80 నుంచి 100కు కొనుగోలు చేస్తున్నాడు. ఆ పొడిలో కొబ్బరి పీచు, పంచదార పాకం, రసాయనాలు కలిపి కల్తీ టీ పొడిని తయారు చేస్తున్నాడు. దానిని కిలో రూ. 200 నుంచి 250 వరకు అమ్ముతున్నట్లు చెబుతున్నారు అధికారులు.
Read Also: Rafael Nadal: టెన్నిస్కి గుడ్ బై చెప్పిన రఫెల్ నాదల్..
ఒరిస్సాకు చెందిన ప్రతాప్ ప్రధాన్, ఫరీదాలు ఇతని వద్దే పని చేస్తున్నట్లు తెలిపారు. వీరిద్దరు ఇతర షాపులకు టీ పొడి రవాణా చేస్తున్నట్లు చెబుతున్నారు. నిందితులను విచారణ కోసం ఫుడ్ సేఫ్టీ అధికారులకు అప్పగించారు టాస్క్ ఫోర్స్ అధికారులు. కల్తీ టీపొడి వాడకంతో కామెర్లు, టైఫాయిడ్, ఎలర్జీలు, క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు అధికారులు. కొనుగోలు చేసే ముందు నాణ్యతను పరిశీలించుకోవాలని టాస్క్ ఫోర్స్ అధికారులు సూచిస్తున్నారు.