NTV Telugu Site icon

Fire Accident: బాపట్ల జిల్లా కర్లపాలెంలో అగ్నిప్రమాదం.. పేదల గుడిసెలు దగ్ధం

Fire Bapatla

Fire Bapatla

బాపట్ల జిల్లా కర్లపాలెంలో అగ్నిప్రమాదం జరిగింది. కర్లపాలెం మండలం లంకకట్ట కాలువ సమీపంలో నివాసం ఉంటున్న పేదల గుడిసెలు అగ్నికి ఆహుతి అయ్యాయి. కాలువ కట్టపై ఉన్న ఇళ్లలో ఒక్కసారిగా మంటలు చెలరేగటంతో ఇళ్లలో ఉన్న వారు భయంతో బయటకు పరుగులు తీశారు. అయితే మంటలు దట్టంగా వ్యాపించడంతో అగ్నిమాపక దళాలు వచ్చేలోపే 9 పూరిల్లు దగ్దమయ్యాయి. మరోవైపు.. అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న ఇళ్లను మంటల నుంచి రక్షించేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నం చేశారు.

Read Also: Kolkata Doctor Murder: ఉ..2:45గంటల వరకు బతికే ఉన్న ట్రైనీ డాక్టర్ !.. తర్వాత ఏం జరిగింది?

అయితే.. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలుస్తోంది. కానీ.. తాము నివసించే ఇళ్లు కాలిబూడిదయ్యాయని బాధితులు తీవ్రంగా రోదిస్తున్నారు. మరోవైపు ఈ ప్రమాదం గురించి తెలుసుకుని.. అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం ఎలా జరిగిందనే వివరాలు సేకరిస్తున్నారు. తాత్కాలిక ఉపశమనం కింద బాధితులకు ఆహార పదార్థాలు అందించారు. కాగా.. బాధితులను ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని అధికారులు చెప్పారు.

Read Also: Trisha: విజయ్‌ కోసం రూల్‌ బ్రేక్‌ చేసిన త్రిష!

Show comments