NTV Telugu Site icon

Delhi fire: ఓ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. మంటలార్పుతున్న 26 ఫైరింజన్లు

Fire

Fire

దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ముండ్కా ఇండస్ట్రియల్ ఏరియాలోని ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. జేడబ్ల్యూ పూరి ప్రాంతంలో ఉన్న ఫ్యాక్టరీలో శనివారం సాయంత్రం 4:30 గంటలకు పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. సమీప ప్రాంతాలన్నీ పొగతో కమ్ముకున్నాయి. మంటలు కూడా భారీ స్థాయిలో ఎగిసిపడుతున్నాయి.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకుని మంటలు ఆర్పుతున్నారు. దాదాపు 26 ఫైరింజన్లు మంటలు ఆర్పుతున్నాయి. సంఘటనాస్థలికి పోలీసులు చేరుకున్నారు. పరిస్థితుల్ని సమీక్షిస్తున్నారు. మంటలను కంట్రోల్‌లోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎవరికైనా ఏదైనా జరిగిందా? లేదంటే ఆస్తి నష్టం ఎంత జరిగింది అన్నదానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఇటీవల ముంబై సమీపంలోని థానే కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు ధాటికి 10 మంది చనిపోగా.. పలువురు తీవ్రగాయపడ్డారు.

ఇది కూడా చదవండి: Special casual leave: రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మే 27న ప్రత్యేక క్యాజువల్ సెలవులు..

 

Show comments