NTV Telugu Site icon

Medchal : బావిలో సెక్యూరిటీగార్డ్ మృతదేహం.. చంపిందెవరంటే?

New Project (1)

New Project (1)

Medchal : మేడ్చల్ జిల్లా శామీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు సెక్యూరిటీ గార్డ్స్ మధ్య వివాదం తలెత్తింది. ఈ ఇద్దరు సెక్యూరిటీ గార్డ్స్ మధ్య గొడవ హత్యకు దారి తీసింది. తానే హత్య చేశానని చెప్పి మరో సెక్యూరిటీ గార్డ్ పరారయ్యాడు. ఈ సంఘటన శామీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం సృష్టిస్తోంది. అసోం రాష్ట్రానికి చెందిన శ్రీ ప్రొబిన్ (39), తీటరాం లు లాల్ గడి మలక్ పేట్ గ్రామ పరిధిలోని హై టెక్ సీడ్ కంపెనీలో గత ఏడాదిగా సెక్యూరిటీ గార్డ్స్ గా పని చేస్తున్నారు.

Read Also: Polavaram Project: పోలవరం ప్రాజెక్ట్‌ సవరించిన అంచనా ఎంతంటే?

ఆదివారం రాత్రి వారి మధ్య ఏ విషయంలో గొడవ జరిగిందో?… పాత కక్షలే ఉన్నాయో కాని శ్రీ ప్రొబిన్ ను కత్తితో గొంతు కోసి చంపి మృతదేహాన్ని బావిలో పడేశాడు. అనంతరం కంపెనీ లో పనిచేస్తున్న సిబ్బందికి ఫోన్ చేసి తానే హత్య చేశానని చెప్పి నిందితుడు తీటారం పరారయ్యాడు. విషయం తెలుసుకున్న శామీర్ పేట్ సీఐ సుధీర్ కుమార్ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నారు. పరారీలో ఉన్న తీటరాం ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. క్లూస్ టైమ్ సంఘటన స్థలంలో లభ్యమైన సామగ్రిని సీజ్ చేశారు. అంతేకాకుండా బావి నుండి శ్రీ ప్రొబిన్ మృతదేహన్ని సీఐ సుధీర్ కుమార్ ఆధ్వర్యంలో వెలికి తీశారు. హత్యకు గల కారణాలపై పోలీస్ లు అన్నికోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

Read Also: Supreme Court : ఈ కేసులో కవిత నిందితురాలు కాదు.. ఈడీ ఎలాంటి ప్రొసీజర్ ఫాలో కాలేదు

Show comments