Site icon NTV Telugu

Dead Body In Suitcase: శవాన్ని సూట్ కేసులో ఉంచి రైలు ప్లాట్‌ఫాంపై విసిరేసిన తండ్రీకూతురు

Dead Body

Dead Body

Dead Body In Suitcase: ఓ శవాన్ని సూట్ కేసులో ఉంచి రైలు ప్లాట్‌ఫాంపై తండ్రి కూతుర్లు విసిరేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. అచ్చం ఇదివరకు ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాలో లాగా ఘటన జరిగింది. నెల్లూరు నగరంలో మహిళను హత్య చేసి మృతదేహాన్ని సూట్ కేసులో తీసుకొని వచ్చి మీంజూర్ స్టేషన్ వద్ద సూట్ కేసును ప్లాట్‌ఫాంపై విసిరేశారు తండ్రి కూతురు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే..

Read Also: Game Changer Teaser: మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘గేమ్ ఛేంజర్‌’ టీజర్ డేట్ ఫిక్స్!

అచ్చం సినిమా వలె జరిగిన ఈ సంఘటన చర్చనీయాంశంగా మారింది. నెల్లూరు నగరానికి చెందిన సుబ్రహ్మణ్యం అతని కూతురు దివ్యశ్రీ నెల్లూరులో ఓ మహిళను హత్య చేసి ఆపై చెన్నై వైపు వెళ్లే సబర్బన్ ఎలక్ట్రికల్ రైలులో ప్రయాణం చేసి మంజూర్ స్టేషన్ కు రాగానే స్టేషన్ ప్లాట్‌ఫాంపై తండ్రి కూతురు శవం ఉంచిన సూట్ కేసును పడేశారు. అలా వారు పడేసి వెళ్లిన తర్వాత.. ఆ సూట్ కేసును సదరు రైల్వే పోలీస్ కానిస్టేబుల్ మహేష్ సూట్ కేసు నుండి రక్తం రావడం గమనించాడు. దానితో అనుమానం వచ్చిన పోలీస్ కానిస్టేబుల్ మహేష్ తో తెరిచి చూడగా విషయాన్ని అధికారులకు తెలిపారు. ఈ విషయంపై పోలీసులు ఆరాతీయగా తండ్రి కూతుర్ల బాగోతం బయటపడింది. దీంతో పోలీసులు తండ్రికూతురిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు తమిళనాడు పోలిసులు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Read Also: Free Gas Cylinder: ఉచిత గ్యాస్‌కి సూపర్‌ రెస్పాన్స్‌.. భారీగా బుకింగ్స్‌.. అదే స్థాయిలో డెలివరీ

Exit mobile version