గుంటూరు జిల్లాలో తెనాలి నాజర్ పేటలో కిరణా షాపు వ్యాపారి కుటుంబం మొత్తం ఆత్మహత్యాయత్నం చేసుకుంది. పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి శంకర్ రావు అనే వ్యాపారి కుటుంబం ప్రయత్నించింది. ఇక, భార్య, కుమార్తె కుటుంబం విష గుళికలు మింగారు. అయితే, చికిత్స పొందుతూ శివ శంకర్ భార్య నాగమణి అనే మహిళ మృతి చెందింది. తండ్రి, కూతురుకి డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. అయితే, ఆర్థిక ఇబ్బందులే ఆత్మహత్యాయత్నానికి కారణమని స్థానికులు చెబుతున్నారు.
Read Also: Paytm : జస్ట్ 2డేస్ మాత్రమే.. ఇకపై ఆ సర్వీసును బంద్ చేయనున్న పేటీఎం
వివరాల్లోకి వెళ్తే.. అత్తింటి వేధింపులు, అప్పుల బాధతో తమ కుటుంభం ఆత్మహత్యాయత్నం చేసిందని టీ- షాప్ నడుపుతున్న శివశంకర్ తెలిపారు. కుమార్తె హారికకి తెనాలికి చెందిన ఓ వ్యక్తితో మూడు సంవత్సరాల క్రితం వివాహం చేశాం.. అప్పు చేసి పదిహేను లక్షలు కట్నం ఇచ్చి పెళ్లి చేసినట్లు బాధితుడు చెప్పాడు. అయినా సరే అదనపు కట్నం కోసం అల్లుడు కుమార్తెను తరచు వేధింపులకు గురి చేస్తున్నాడని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే తన బిడ్డకు రెండు సార్లు అబార్షన్ చేయించాడంతో పాటు తమను తన బిడ్డను మానసికంగా వేదిస్తున్నారని బాధితుడు శివశంకర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుమార్తె కాపురం సరిగ్గా లేకపోవడం అప్పుల బాధ ఎక్కువ కావడంతో ముగ్గురం కలిసి ఆత్మహత్యాయత్నం చేశామని బాదితుడు శివశంకర్ వాపోయాడు.