Dog : కుక్క విశ్వాసం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక్కసారి వాటికి ప్రేమను చూపిస్తే చాలు చచ్చేంత వరకు విశ్వాసంగా పడి ఉంటాయి. అంతే కాకుండా ట్రైనింగ్ పొందిన పోలీసు జాగిలాలు నేరస్థులను పట్టేస్తాయి. ఎన్నో నేరాలను ఛేదించడంలో ఇవి ప్రముఖ పాత్ర వహించాయి. తన యజమానికి ఆపదొస్తే కాపాడేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తాయి. తాజాగా గుండె పోటుతో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తి ప్రాణాలు కాపాడి ఓ కుక్క రియల్ హీరో అనిపించుకుంది. దీని సాహసానికి మెచ్చిన అధికారులు అవార్డును కూడా ఇచ్చారు. ప్రస్తుతం ఆ కుక్క ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటుంది.
Read Also:Ari: ఇస్కాన్ ప్రశంసలు అందుకున్న ‘అరి’
వివరాల్లోకి వెళితే.. జపాప్‌లోని చిబా నగర సమీపంలో గుండెపోటుతో తల్లడిల్లుతున్న వ్యక్తి ప్రాణాలను శనకం కాపాడింది. వాకబాకు ఏరియాలో ఉన్న ఓ గుర్రపు స్వారీ క్లబ్‌లో ఈ ఘటన జరిగింది. 50 ఏళ్ల వయస్సు ఉన్న ఓ వ్యక్తికి స్వారీ సమయంలో గుండెపోటుకు గురై ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఈ సమయంలో కౌమే అనే కుక్క అతడిని చూసి గట్టిగా అరవడం మొదలుపెట్టింది. కుక్క అరుపుతో క్లబ్ లోని వారందరూ వ్యక్తి పడిపోయి ఉన్న ప్రాంతానికి వెళ్లారు. దీంతో అతడిని వెంటనే దగ్గరలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. డాక్టర్లు వెంటనే చికిత్స అందించడంతో సదరు వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. గట్టిగా అరిచి వ్యక్తి ప్రాణాలు కాపాడిన శునకాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు.
Read Also:Santosh Shoban: అమ్మ నన్ను నమ్మింది కాబట్టి సినిమాలు చేస్తున్నా…
ఈ క్రమంలోనే అగ్నిమాపక సిబ్బంది కుక్కను అభినందించారు. శునకానికి ప్రశాంసాపత్రాన్ని అందించడంతో పాటు రివార్డు ప్రకటించారు. అయితే ఈ శునకం ఎప్పుడూ ఆ క్లబ్ లోనే ఉంటుందట. ఇది ఎప్పుడూ సైలెంట్ గా ఉంటుందని, అత్యవసర సమయాల్లో మాత్రమే గట్టిగా అరుస్తుందని క్లబ్ నిర్వాహకులు చెబుతున్నారు. గతంలోనూ ఒక గుర్రం కంచె దూకి పారిపోయేందుకు ప్రయత్నిస్తుంటే ఇలాగే అరిచి తమను అప్రమత్తం చేసిందని క్లబ్ యాజమాన్యం చెబుతోంది.
