NTV Telugu Site icon

West Godavari District: అలర్ట్ కోళ్లకు సోకిన అంతుచిక్కని వైరస్.. రోజు వేల సంఖ్యలో మృత్యువాత

West Godavari

West Godavari

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కోళ్లను అంతు చిక్కని వ్యాధి పట్టి పీడిస్తోంది. రోజు వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. ఆరోగ్యంగా కనిపించే కోడి గంటల వ్యవధిలో మృత్యువాత పడుతోంది.. డిసెంబర్ లో మొదలైన వైరస్.. జనవరి 13తర్వాత విజృంభించింది. H15N వైరస్ లక్షణాలతో రోజూ వేల సంఖ్యలో చనిపోతున్నాయి. వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. దీంతో పౌల్ట్రీ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.

READ MORE: Sonia Gandhi: రాష్ట్రపతిపై వ్యాఖ్యలు.. సోనియాగాంధీపై ఫిర్యాదు చేసిన న్యాయవాది..

50శాతం రైతులు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో తీవ్రంగా నష్టపోయారు. ఇప్పటికే 40 లక్షల కోళ్లు చనిపోయి ఉంటాయని అంచనా.. మేత తినడం, గుడ్డు పెట్టిన కొద్ది సేపటికీ మృత్యు వాత పడుతున్నాయి. బ్యాంకులకు బాకీలు కట్టలేక రోడ్డున పడుతున్నారు పౌల్ట్రీ రైతులు.. వ్యాక్సిన్ వేస్తున్న ఉపయోగం లేకుండా పోతోంది.. 2012, 2020లో ఇదే తరహాలో వైరస్ వ్యాపించింది. ప్రస్తుతం గతం కంటే వేగంగా వ్యాపిస్తోంది. వైరస్ వ్యాప్తి కి కారణాలు తెలియక రైతులు గగ్గోలు పెడుతున్నారు.. టెస్టుల నిమిత్తం కోళ్ల బ్లడ్ శాంపిల్స్ భోపాల్ పంపుతున్నారు. కోళ్లకి వైరస్ వ్యాప్తిని విపత్తుగా ప్రకటించాలని రైతుల డిమాండ్ చేస్తున్నారు..

READ MORE: Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. లోయలో పడ్డ బస్సు.. ఏడుగురు మృతి.. 15మందికి గాయాలు