Zomato Biryani : బిర్యానీపై భారతీయులకు ఉన్న ప్రేమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. లక్నో బిర్యానీ, హైదరాబాదీ బిర్యానీ, కోల్‌కతా బిర్యానీ ఇలా దేశంలో ఏ మూలకు వెళ్లినా ఆ ప్రాంతం పేరుతో బిర్యానీ దొరుకుతుంది. దీంతో దేశం మొత్తం బిర్యానీని ఎక్కువగా ఇష్టపడుతుందని మరోసారి రుజువైంది. జొమాటో 2022కి సంబంధించిన వార్షిక రిపోర్ట్‌ను వెళ్లడించింది. ఆ రిపోర్టులో ప్రతి నిమిషానికి 186 బిర్యానీ ఆర్డర్‌లు డెలివరీ చేయబడినట్లు ఆ రిపోర్టులోని డేటా చెబుతోంది. వాస్తవానికి, 2022 స్విగ్గీ నివేదిక కూడా 2022లో నిమిషానికి 137 బిర్యానీలు ఆర్డర్ చేయబడిందని చెబుతోంది.
Read Also : Church Vandalised : చర్చిని ధ్వంసం చేసిన దుండగులు.. కర్ణాటకలో ఉద్రిక్తత
జొమాటో 2022 ట్రెండ్ రిపోర్ట్ ప్రకారం, ప్రతి నిమిషానికి 139 పిజ్జా డెలివరీలతో పిజ్జా రెండవ స్థానంలో నిలిచింది. ఆకర్షణీయమైన ఆఫర్లు, వందలాది రకాల రుచికరమైన ఆహార పదార్థాల లభ్యతతో ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్స్‌పై ఆర్డర్లు చేసే కస్టమర్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ క్రమంలో లెక్కకు మించి ఆర్డర్లు ఇచ్చేవారు కూడా ఉంటారని ఓ కస్టమర్ నిరూపించాడు. ఢిల్లీకి చెందిన అంకుర్ అనే జొమాటో కస్టమర్ 2022 ఏడాదిలో ఏకంగా 3,330 ఫుడ్ ఆర్డర్లు ఇచ్చాడు. ఏడాదంతా ప్రతిరోజూ సగటున 9 చొప్పున ఫుడ్ ఆర్డర్లు ఇచ్చాడు. దీంతో అంకుర్‌ను 2022లో ‘ది నేషన్స్ బిగ్గెస్ట్ ఫుడీ’గా జొమాటో గుర్తించింది. దీంతో అతనికి బెస్ట్ కస్టమర్ అవార్డును ప్రకటించింది. ఇక ముంబైకి చెందిన మరో వ్యక్తి యాప్ లో ప్రోమో కోడ్లను ఉపయోగించి ఏకంగా 2.43 లక్షలు సేవ్ చేశాడట. ఈ మేరకు తన వార్షిక రిపోర్టులో పేర్కొంది. 2022లో కూడా బిర్యానీ అత్యధికంగా ఆర్డర్ ఇచ్చిన ఫుడ్‌గా నిలిచిందని పేర్కొంది.