Site icon NTV Telugu

Pawan Kalyan: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై క్రిమినల్ కేసు నమోదు

Pawankalyan Janasena

Pawankalyan Janasena

Pawan Kalyan: జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై రాష్ట్ర ప్రభుత్వం గుంటూరు క్రిమినల్ కేసు దాఖలు చేసింది. వాలింటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారని సీరియస్ అయిన ప్రభుత్వం.. గుంటూరు న్యాయస్థానంలో కేసు దాఖలు చేసింది. గతేడాది జులై 9న ఆయన వాలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించారనే ఆరోపణలతో కేసు పెట్టింది. ఈ క్రమంలో 499, 500 ఐపీసీ సెక్షన్ల కింద పవన్‌పై క్రిమినల్‌ కేసు నమోదు చేసిన జిల్లా కోర్టు.. కేసును నాలుగో అదనపు జిల్లా కోర్టుకు బదిలీ చేసింది. పవన్‌ కల్యాణ్ మార్చి 25న విచారణకు హాజరు కావాలని న్యాయమూర్తి నోటీసులు ఇచ్చారు. గతేడాది జులై 9న పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతూ.. కేంద్ర నిఘా వర్గాల సమాచారం మేరకు రాష్ట్రంలో వేల మంది అమ్మాయిలు అదృశ్యమయ్యారని అన్నారు. వారిలో 14 వేల మంది తిరిగి వచ్చారని పోలీసులు చెబుతున్నారని తెలిపారు.

Read Also: Tirumala: భక్తులకు గుడ్‌న్యూస్.. రేపటి నుంచి మే నెల దర్శన టికెట్లు విడుదల

జూలై 9న వారాహి యాత్రలో ఏలూరులో రాష్ట్రంలో వేల మంది అమ్మాయిలు మిస్సింగ్ అంటూ పవన్ ఆరోపణలు చేశారు. తాడికొండ మండలం కంతేరుకి చెందిన వాలంటీర్ పవన్ కుమార్‌తో పాటు మరి కొందరు ఇచ్చిన వాంగ్మూలంపై కేసు నమోదు చేస్తున్నట్లు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ మార్చి 25న విచారణకు హాజరు కావాలని న్యాయస్థానం ఆదేశించింది.

Exit mobile version