Site icon NTV Telugu

Cobra Coiled Around Shivling: శ్రీశైలంలో శివలింగాన్ని చుట్టుకొని ఉన్న నాగుపాము.. వీడియో వైరల్‌..

Cobra

Cobra

Cobra Coiled Around Shivling: నాగు పాములు గురించి ఎన్నో కథలు వింటుంటాం.. దేవుడిగా కొలుస్తాం.. కానీ, అవి కళ్లముందు ప్రత్యక్షమైతే చాలు ఎక్కడ లేని అలజడి.. ఆందోళన.. మరోవైపు.. దేవాలయాల్లో నాగుపాములు కనిపించిన ఘటనలు ఎన్నో ఉన్నాయి.. ముఖ్యంగా శివలింగాలు ఉన్న ఆలయాల్లో లింగాన్ని చుట్టుకుని పాములు ఉన్న వీడియోలు కూడా తరచూ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంటాయి..

Read Also: Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

ఇప్పుడు ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో.. ఓ నాగుపాము హల్‌ చల్‌ చేసింది.. శ్రీశైలం పాతాళగంగ రోడ్డు మార్గం వజ్రమ్మ గంగమ్మ వెనుక గల శివలింగానికి చుట్టుకుని నాగు పాము ప్రత్యక్షమైంది.. ఈ నెల 15 తేదీన ఆ ఆలయానికి వెళ్లిన కొందరు భక్తులు ఇది గమనించి.. వీడియోలు చిత్రీకరించారు.. ఆ తర్వాత సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు.. దీంతో.. శివలింగాన్ని చుట్టుకొని ఉన్న నాగుపాము వీడియో కాస్తా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.. శివలింగాన్ని పాము చుట్టుకుని ఉండడంతో వీడియో చూసి శ్రీశైలం మల్లన్న భక్తులు భక్తి పారవశ్యంతో మొక్కుతున్నారు. మరోవైపు.. ఈ విషయం కాస్తా స్థానిక భక్తులు తెలియడంతో.. పెద్ద సంఖ్యలో ఆ ఆలయానికి వెళ్లి నాగుపామును దర్శించుకున్నారని స్థానికులు చెబుతున్నారు.

Exit mobile version