NTV Telugu Site icon

Heart Attack: దేవుడా.. గుండెపోటుతో యూకేజీ చదువుతున్న చిన్నారి మృతి

Heart Attack

Heart Attack

పిల్లలు, యువకులు, పెద్దలు అనే తేడా లేకుండా గుండెపోటు మరణాలు అందరిలోనూ వస్తున్నాయి. తాజాగా.. యూపీలోని అమ్రోహాలో యూకేజీ (UKG) చదివే చిన్నారి గుండెపోటుకు బలయింది. ఉన్నట్టుండి తరగతి గదిలో అస్వస్థతకు గురి కాగా.. వెంటనే చిన్నారిని గజ్రాలలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ డాక్టర్లు పరిశీలించి చనిపోయినట్లు ప్రకటించారు. దీంతో.. విద్యార్థిని కుటుంబం తీవ్ర విషాదంలో మునిగింది. కాగా.. ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోకుండానే మృతదేహాన్ని ఖననం చేశారు.

Read Also: Ganapathi Bappa Morya: ‘గణపతి బప్పా మోరియా’ లోని ‘బప్పా’, ‘మోరియా’ అనే పదాల అర్థం ఏంటో తెలుసా..?

వివరాల్లోకి వెళ్తే.. జహాన్, తన్వీర్ అహ్మద్ కుమార్తె ఇఫ్ఫత్ (5 సంవత్సరాల చిన్నారి).. షకర్‌గర్హి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో యూకేజీ చదువుతుంది. రోజూలాగే శనివారం కూడా స్కూల్‌కి వెళ్లింది. తరగతి సమయంలో చిన్నారి ఆరోగ్యం క్షీణించింది. ఈ క్రమంలో.. టీచర్లు తల్లిదండ్రులకు సమాచారం అందించారు. వారు వెంటనే పాఠశాలకు చేరుకుని.. తొలుత ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా, అనంతరం గజ్రౌలాలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అయితే.. ఆ చిన్నారి అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. గుండెపోటుతో చనిపోయిందని డాక్టర్లు పేర్కొన్నారు. కాగా.. చిన్నారి మృతి పట్ల అందరూ విచారం వ్యక్తం చేస్తున్నారు.

Read Also: Isha Vidhya: ఈశా విద్యకు మద్దతుగా పరుగే పరుగు..

మరోవైపు.. వారం క్రితం కాన్పూర్‌లో ఆరో తరగతి విద్యార్థిని గుండెపోటుతో మృతి చెందింది. స్వాతంత్ర్య దినోత్సవం రోజున పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 12 ఏళ్ల బాలిక అవ్నీ గుప్తా నృత్య ప్రదర్శన చేస్తోంది. ఈ సమయంలో బాలిక పరిస్థితి ఒక్కసారిగా క్షీణించి కింద పడిపోయింది. వెంటనే బాలికను స్కూల్ యాజమాన్యం కార్డియాలజీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. కాగా.. అక్కడ బాలిక గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.