NTV Telugu Site icon

YS Jagan: వైఎస్ జగన్ను కలవాలంటూ బోరున ఏడ్చిన చిన్నారి.. జగన్‌ ఏం చేశాడో చూడండి…

Jagan

Jagan

విజయవాడ గాంధీనగర్‌లోని జిల్లా జైలులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని జగన్ కలిసిన విషయం తెలిసిందే. విజయవాడలో మాజీ సీఎంను చూసేందుకు అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఇంతలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. మాజీ సీఎం జగన్‌ను కలిసేందుకు ఓ పాప బోరున విలపించింది. “అన్న ఫ్లీజ్ అన్న” అంటూ జగన్‌ను కలిసేందుకు ఏడ్చింది. ఆ సమయంలో కారులో కూర్చుని ఉన్న జగన్ ఆ చిన్నారిని చూసి స్పందించారు. ఒక్కసారిగా కారు డోర్‌ నుంచి బయటకు వచ్చారు. చిన్నారిని చెంతకు తీసుకుని నుదిటిపై ముద్దు పెట్టారు. ఆ చిన్నారి సైతం జగన్‌ను చూసిన ఆనందంలో ఆయన నుదిటిపై ముద్దు పెట్టింది. అనంతరం ఆ పాప జగన్‌తో సెల్ఫీ దిగింది. సంతోషంతో ఉప్పొంగిపోయిన పాప ఏడుస్తూనే జగన్ ప్రయాణిస్తున్న కారు నుంచి దిగింది. జగన్‌ చేసిన ఈ పనిని చూసి అక్కడున్న అభిమానుల్లో సైతం ఉత్సాహం రేకెత్తించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

READ MORE: Russia-Ukraine war: మొదలైన శాంతి చర్చలు.. ఉక్రెయిన్ లేకుండానే చర్చలు

ఇదిలా ఉండగా..వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ములాఖత్‌లో మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ కలిశారు. దాదాపు 30 నిమిషాల పాటు వంశీతో జగన్‌ ములాఖత్ అయ్యారు. జగన్ వెంట వంశీ సతీమణి పంకజశ్రీ, సింహాద్రి రమేష్ జైలు లోపలికి వెళ్లారు. ములాఖత్‌లో వంశీని పరామర్శించడానికి కొడాలి నాని, పేర్ని నాని పేర్లు కూడా వైసీపీ నేతలు ఇచ్చారు. సెక్యూరిటీ రీజన్స్ కారణంగా ఈ ఇద్దరికీ అనుమతి ఇవ్వలేమని జైలు అధికారులు చెప్పారు. విజయవాడ జైల్లో కిడ్నాప్ కేసులో వంశీ రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే.

READ MORE: AAI Recruitment 2025: లైఫ్ సెట్ చేసే జాబ్స్.. ఎయిర్ పోర్ట్ అథారిటీలో భారీగా జాబ్స్.. నెలకు రూ. 1.4 లక్షల జీతం