NTV Telugu Site icon

PM Modi Birthday: మీరు ప్రధాని మోడీకి డైరెక్ట్ గా బర్త్ డే విషెస్ చెప్పాలనుకుంటున్నారా..?

Modi Wishes

Modi Wishes

నేడు ప్రధాని మోడీ పుట్టిన రోజు ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా అనేక ప్రత్యేక కార్యక్రమాలకు బీజేపీ శ్రీకారం చుట్టింది. ఇవాళ అనేక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. కాగా.. ప్రధాని మోడీ 73వ జన్మదినాన్ని పురస్కరించుకుని బీజేపీ ఇవాళ్టి నుంచి ‘సేవా పఖ్వాడా’ అనే కార్యక్రమం స్టార్ట్ చేసింది. దీంతో పాటు నమో యాప్ లో ‘ఎక్స్‌ప్రెస్ యువర్ సేవా భావ్’ క్యాంపెయిన్ ను ఆరంభించింది. ఇందులో పాల్గొనడం వల్ల ప్రధాని నరేంద్ర మోడీకి ప్రతీ ఒక్కరూ నేరుగా బర్త్ డే విషెస్ తెలిపే ఛాన్స్ ఉంది. దేశానికి సేవ చేసేలా పౌరులను ప్రేరేపించడమే ఈ క్యాంపెయిన్ ఉద్దేశమని కమలం పార్టీ తెలిపింది.

Read Also: Redmi Smart Fire TV 4K: రెడ్‌మీ నుంచి సరికొత్త స్మార్ట్‌ టీవీ.. తక్కువ ధరలో సూపర్ ఫీచర్స్!

ఈ నమో యాప్ ద్వారా ప్రజలు నేరుగా ప్రధాని నరేంద్ర మోడీకి వీడియో సందేశం పంపించి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పొచ్చు. దీని కోసం శుభాకాంక్షలు తెలుపుతున్న వీడియోను మీ ఫోన్ లో రికార్డ్ చేసి.. దాన్ని నమో యాప్ లో అప్ లోడ్ చేయాలి. ఈ వీడియో గ్రీటింగ్స్ వీడియో వాల్ పై కూడా కనపడుతుంది. దీన్ని రీల్ ఫార్మట్ లో తయారు చేసి అప్ లోడ్ చేయాలి. ఈ వీడియోతో పాటు ప్రధానికి ‘సేవ బహుమతి’ కూడా ఇవ్వొచ్చని బీజేపీ తెలిపింది. నమో యాప్ వినియోగించే వారు.. లేదా ఇంకా ఎవరైనా కింద సూచించిన సేవా కార్యక్రమాలు చేసిన ప్రధానికి గిఫ్ట్ గా ఇవొచ్చు.

Read Also: KH 234: సైమా స్టేజ్ పైన… ‘నాయకుడు’ రేంజ్ సినిమా లీక్ ఇచ్చిన కమల్

ఇందులో తొమ్మిది విభిన్న సేవా కార్యక్రమాలు ఉంటాయి. దాన్ని పూర్తి చేసిన తర్వాత యూజర్ ఫోటోలను అప్ లోడ్ చేసుకోవచ్చు.. ఈ సేవా కార్యక్రమాలను పూర్తి చేసిన తరువాత పొందిన బ్యాడ్జీలను మీ కుటుంబ సభ్యులకు, ఫ్రెండ్స్ కు సోషల్ మీడియాలో షేర్ చేసుకోవచ్చు. ఈ కార్యక్రమంతో పాటు కుటుంబం అంతా ప్రధానికి ఒకే సారి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపే ఛాన్స్ నమో యాప్ కల్పించింది. ‘ఫ్యామిలీ ఈ కార్డ్’ అనే ఆప్షన్ ద్వారా దానికి సంబంధించిన వీడియోను ఒకే గ్రీటింగ్ లో చేర్చే అవకాశం ఉంది.

Read Also: Kishan Reddy: విమోచనం కోసం మొదటిసారి గొంతు ఎత్తిన పార్టీ బీజేపీ

ఈ లింక్ ను క్లిక్ చేయడం ద్వారా వీడియోను అప్ లోడ్ చేయొచ్చు..-https://nm-4.com/VideoShubhkaamna
ఈ లింక్ ను క్లిక్ చేయడం ద్వారా ఫ్యామిలీ ఈ కార్డ్ గ్రీటింగ్స్ చెప్పొచ్చు.-https://nm-4.com/FamilyEcard

Show comments