NTV Telugu Site icon

Shamshabad: యువకుడ్ని చెట్టుకు కట్టేసి కొట్టిన గ్రామస్తులు.. చివరకు..

Shamshabad

Shamshabad

Shamshabad: కొందరు మద్యం మత్తులో ఏం చేస్తున్నారన్న విషయం కూడా వారికి తెలియకుండా చేసేస్తుంటారు. అలా కొన్నిసార్లు వారి ప్రాణాల మీదికి తెచ్చుకుంటారు చాలామంది. ముఖ్యంగా మద్యం తాగిన సమయంలో రోడ్లపై వాహనాలు నడుపుతూ వారి ప్రాణాలు రిస్క్ లో పెట్టడమే కాకుండా.. ఎదుటోడి ప్రాణాలు కూడా రిస్కులు పడేయడం లాంటి సంఘటనలకు సంబంధించి అనేక ఘటనలు జరిగాయి. ఇకపోతే తాజాగా హైదరాబాదులోని శంషాబాద్ ఏరియాలో ఓ దారుణ సంఘటన చోటుచేసుకుంది. జ్యోతి కుమార్ అనే 30 ఏళ్ల వ్యక్తి మద్యానికి బానిసగా మారాడు. అయితే ఆ వ్యక్తి మద్యం తాగిన సమయంలో అతడు ఉంటున్న ఏరియాలో ఉన్న మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న సంఘటనలు చాలానే జరిగాయి.

Joe Biden: అయ్యో బైడెన్ ఏంటయ్యా ఇది.. భార్య అనుకుని వేరే మహిళకు?

ఇదివరకు కూడా అతను తాగిన మైకంలో తన ఒంటిపై ఉన్న బట్టలను విప్పేసి స్థానిక మహిళలతో అసభ్యంగా వ్యవహరించాడని అక్కడి నివాసితులు తెలిపారు. అంతేకాకుండా., అతను సొంత సోదరిపై కూడా లైంగిక దాడి కేసులో జైలు జీవితం గడిపాడని కూడా తెలుస్తుంది. దీంతో ఓ రోజు అతని ప్రవర్తన శృతిమించిపోవడంతో స్థానికంగా ఉన్న కొందరు మహిళలు అతడిని చెట్టుకు కట్టేశారు. దింతో అతనికి విపరీతమైన దాహం వేస్తున్న అతనిని పట్టించుకోకుండా అలాగే చెట్టుకు వదిలేశారు. దాంతో అతడు చెట్టుకు ఉండగానే ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఈ విషయం కాస్త పోలీసులకు చేరింది.

Banjara Hills: విద్యుత్‌ బకాయి చెల్లించమంటే పిడిగుద్దులు కొట్టారు భయ్యా..

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే కేసును దర్యాప్తు చేపట్టారు. పరోక్షంగా ఆ వ్యక్తి మృతికి కారణమైన నలుగురు మహిళలు అంటూ వారి విచారణలో తేలింది. దీంతో కేసు మళ్ళీ తిరిగి మహిళల మెడకే చుట్టుకున్న సంఘటన శంషాబాద్ లో చోటుచేసుకుంది. ప్రస్తుతం పోలీసులు నలుగురు మహిళలపై కేసు నమోదు చేశారు..

Show comments