బాలీవుడ్ బ్యూటీ తాప్సి పన్ను గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ సొట్ట బుగ్గల సుందరి తన సినీ కెరీర్ మొదట తెలుగు సినిమాతోనే మొదలు పెట్టింది. మంచు మనోజ్ హీరోగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన “ఝుమ్మంది నాదం” సినిమాతో టాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయం అయింది.ఆ సినిమా అంతగా ఆకట్టుకోకపోయిన తన గ్లామర్ తో తాప్సి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత తెలుగు మరియు తమిళ్ లో ఈ భామ వరుస సినిమాలు చేసి ఎంతగానో ఆకట్టుకుంది. ఆ తరవాత చేసిన సినిమాలు సరిగ్గా నడవకపోవడంతో సరైన అవకాశాలు రాక బాలీవుడ్ కి వెళ్ళింది. బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వగానే పెద్ద పెద్ద స్టార్స్ తో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. అయితే బాలీవుడ్ కి వెళ్ళడానికి గల కారణాలను క్రికెటర్ శిఖర్ ధావన్ చేస్తున్న ధావన్ కరేంగే అనే చాట్ షో లో పంచుకుంది.
తన బాలీవుడ్‌లో తన ఎంట్రీకి నటి ప్రీతి జింటాకు సంబంధం ఉందని తాప్సీ పన్ను వెల్లడించింది. ఈ వారం శిఖర్ ధావన్‌తో ధావన్ కరేంగే అనే చాట్ షోలో అతిథిగా పాల్గొన్న తాప్సి, తన సినీ ఆరంగ్రేటం గురుంచి పలు విషయాలను పంచుకుంది. ఇంజనీరింగ్ కాలేజీలో ఉండగానే తెలుగు, తమిళ భాషల్లో సినిమా ఆఫర్లు వచ్చాయి. కొన్నాళ్లకే ఆమెకు బాలీవుడ్‌లోనూ ఆఫర్లు రావడం మొదలయ్యాయి. నేను చూడడానికి కొంచెం ప్రీతీ జింటాలా ఉండడం వల్లే నాకు బాలీవుడ్‌లో ఆఫర్లు వచ్చాయి, అందువల్లే నేను ఆమెలా ఉండడానికి ప్రయతించాను అని తెలిపింది.
ఇటీవలే చిరకాల ప్రియుడు, బ్యాడ్మింటన్ క్రీడాకారుడు మథియాస్ బో ను మార్చిలో ఉదయపూర్‌లో తాప్సీ వివాహం చేసుకుంది. తాప్సీ చివరిగా షారూఖ్‌తో కలిసి డుంకీలో కనిపించింది.