Guntur Crime: చిన్నారులు, పెద్దలు అనే తేడా లేకుండా అఘాయిత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి.. ఈ మధ్య ఈ కేసులో మైనర్లు ఉండడం ఆందోళన కలిగిస్తోంది.. తాజాగా, గుంటూరులో మరో దారుణమైన ఘటన వెలుగుచూసింది.. ఆరేళ్ల బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఓ బాలుడు.. వర్షంలో తడవకుండా గొడుగు ఇస్తానని చెప్పి బాలికపై దారుణానికి ఒడిగట్టాడు.. అభశుభం తెలియని ఆ బాలికను పాడుచేశాడు.. తనపై జరిగిన దారుణానికి తల్లిదండ్రులకు చెప్పడంతో.. పెదకాకాని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.. బాధితురాలిని ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.. ఇక, ఈ ఘటనపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పేదకాకాని పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. కాగా, పసికూనలు, బాలికలు, యువతులు, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా.. ఏదో ఓ చోట ప్రతీరోజు.. ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తున్న విషయం విదితమే. కేసులు నమోదు అవుతున్నా.. శిక్షలు పడుతున్నా కూడా దారుణమైన ఘటనలు జరుగుతూనే ఉన్నాయి.
Read Also: BRS central office: ఢిల్లీలో బీఆర్‌ఎస్ కేంద్ర కార్యాలయం.. ప్రారంభించనున్న సీఎం కేసీఆర్
