Site icon NTV Telugu

Windfall Tax: చమురు కంపెనీలకు దెబ్బ.. విండ్ ఫాల్ ట్యాక్స్‎ను పెంచిన ప్రభుత్వం

Brent Crude Oil Price,

Brent Crude Oil Price,

Windfall Tax: కేంద్ర ప్రభుత్వం చమురు కంపెనీలకు గట్టి షాక్ ఇచ్చింది. పెట్రోలియం క్రూడ్‌పై విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను పెంచుతున్నట్లు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. మంగళవారం నుంచి పెట్రోలియం క్రూడ్‌పై విండ్‌ఫాల్ ట్యాక్స్ టన్నుకు రూ.4,250 నుంచి రూ.7,100కు పెరిగినట్లు ప్రభుత్వం ఈ విషయంపై నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అంతకుముందు ఆగస్టు 1న ప్రభుత్వం టన్నుకు రూ.1600 ఉన్న విండ్ ఫాల్ ట్యాక్స్ ను రూ.4250కి పెంచింది. క్రూడ్ పెట్రోలియంతో పాటు డీజిల్ ఎగుమతిపై స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ (ఎస్ఏఈడీ)ని కూడా పెంచాలని నిర్ణయించిన ప్రభుత్వం.. లీటర్ రూ.1 నుంచి రూ.5.50కి పెంచింది. ఇది కాకుండా జెట్ ఇంధనం అంటే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF)పై కూడా లీటరుకు 2 రూపాయల చొప్పున సుంకం విధించబడింది. మరోవైపు పెట్రోల్‌పై ప్రభుత్వం ఎలాంటి Selected Area Electron Diffraction (SAED) రుసుమును విధించలేదు.

Read Also:Trans fat: ప్రమాదకరంగా ప్యాకేజ్డ్‌ ఫుడ్స్‌.. కొంప ముంచుతున్న చిరుతిండ్లు

2022 సంవత్సరంలో భారత ప్రభుత్వం ముడి చమురుపై విండ్‌ఫాల్ పన్ను విధించడం ప్రారంభించింది. ఈ పన్ను మొదట 1 జూలై 2022న విధించబడింది. చమురు కంపెనీల లాభాలపై ఈ పన్ను విధించనున్నారు. విండ్‌ఫాల్ టాక్స్‌ను ప్రభుత్వం సేకరిస్తుంది. తద్వారా సగటు లాభం కంటే ఎక్కువ సంపాదించే చమురు కంపెనీల నుండి పన్నును తిరిగి పొందవచ్చు. లాభాన్ని చూసిన తర్వాత విండ్ ఫాల్ ట్యాక్స్ విధించాలని ప్రభుత్వం నిర్ణయించడం గమనార్హం. చమురు కంపెనీల లాభాల మార్జిన్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రతి 15 రోజులకు విండ్‌ఫాల్ పన్నును ప్రభుత్వం సమీక్షిస్తుంది.

Read Also:Ben Stokes: బెన్‌ స్టోక్స్‌ సంచలన నిర్ణయం.. ఇంగ్లండ్‌ క్రికెట్ బోర్డు ఒత్తిడి కారణంగా..!

చమురు కంపెనీల లాభం భారీగా పెరిగినప్పుడే ప్రభుత్వం విండ్ ఫాల్ ట్యాక్స్ విధిస్తుంది. దీని వల్ల వారి లాభంలో కొంత భాగం ప్రభుత్వానికి జమ అవుతుంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత ముడి చమురు ధరలో విపరీతమైన పెరుగుదల కనిపించింది. ఆ తర్వాత చమురు కంపెనీల లాభాల నుంచి పన్ను వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనితో పాటు అనేక ప్రైవేట్ చమురు కంపెనీలు ఎక్కువ లాభాలను ఆర్జించడానికి భారతదేశానికి బదులుగా విదేశాలలో చమురును విక్రయించడానికి ఇష్టపడతాయి. ప్రభుత్వం ఈ లాభంపై పన్ను విధిస్తుంది. తద్వారా కంపెనీలు విదేశాలకు బదులుగా దేశంలో చమురును విక్రయించవచ్చు.

Exit mobile version