Site icon NTV Telugu

The Dadasaheb Phalke biopic : మళ్లీ తెరపైకి రాజ్ కుమార్ హిరానీ- అమీర్ ఖాన్ ‘దాదా సాహెబ్ ఫాల్కే’ బయోపిక్..

Bollywood

Bollywood

బాలీవుడ్ తీస్తుంది కదా అని భారతీయ సినీ పితామహుడు దాదా సాహెబ్ ఫాల్కే లైఫ్ స్టోరీ ప్రాజెక్ట్ పక్కన పెట్టేశారు ఎస్ ఎస్ రాజమౌళి- తారక్. పోనీ బీటౌన్‌లో అమీర్ ఖాన్‌తో రాజ్ కుమార్ హిరానీ తీయాలనుకున్న మూవీ పట్టాలెక్కిందా అంటే అదీ లేదు. గత ఏడాదే ఈ వెంచర్ సెట్స్‌పైకి అడుగుపెడుతుంది అనుకున్న టైంలో మిస్టర్ ఫర్ ఫెక్షనిస్ట్ అండ్ డైరెక్టర్‌ హిరానీ మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయని.. ప్రాజెక్ట్ షెడ్డుకు వెళ్లిందన్న రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి.

Also Read : THE STAR ENTERTAINER : ఓవర్సీస్ లో హ్యాట్రిక్ 1 మిలియన్ వసూళ్లు రాబట్టిన యంగ్ హీరో

రాజ్ కుమార్ హిరానీ- అమీర్ ఖాన్ కాంబో అంటేనే బ్లాక్ బస్టర్స్‌కు కేరాఫ్ అడ్డా. ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన త్రీ ఇడియట్స్, పీకే కాసులు కురిపించడంతో పాటు ఓ వర్గానికి ఇన్ఫిరేషన్ మూవీస్‌గా మారాయి. మళ్లీ ఈ పెయిర్.. ధర్డ్ కొలబరేషన్ అంటే అంచనాలు కూడా భారీ స్థాయిలోనే ఉంటాయి. దీనికి తగ్గట్లుగానే మూవీని ప్లాన్ చేస్తున్నారట టీం. అయితే ఈ మధ్య త్రీ ఇడియట్స్ సీక్వెల్స్ ప్లాన్‌లో ఉండటంతో దాదా సాహెబ్ ఫాల్క్ లైఫ్ స్టోరీని పక్కన పెట్టేశారని వార్తలు రాగా, తాజాగా ఈ ప్రాజెక్ట్ లైన్లో ఉందని హింట్ ఇస్తోంది బాలీవుడ్. దాదా సాహెబ్ బయోపిక్‌ను ఈ నెలలోనే పట్టాలెక్కించాలనుకున్నారట అమీర్ ఖాన్ అండ్ హిరానీ. కానీ స్క్రిప్ట్ విషయంలో ఇద్దరు శాటిస్పై కాలేదని తెలుస్తుంది. స్క్రీన్ ప్లే మరింత మెరుగుపర్చాలన్న నిర్ణయంతో జనవరిలో మొదలు కావాల్సిన షూట్ మార్చికి పోస్ట్ పోన్ అయ్యిందని సమాచారం. స్క్రిప్ట్ ఫైనల్ అయ్యాక.. ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుందట. మరీ అనుకున్న టైంకే మొదలు కాబోతుందో..? లేదో లెట్స్ సీ

Exit mobile version