NTV Telugu Site icon

Mumbai: రోడ్డు పక్కన నిల్చున్న మహిళను ఢీకొట్టిన బైకర్.. హెల్మెట్‌తో దాడి

Mumbai

Mumbai

ముంబైలో రోడ్డు పక్కన నిల్చున్న ఓ మహిళను బైక్ పై వచ్చి ఓ వ్యక్తి ఢీ కొట్టాడు. అంతేకాకుండా.. ఆ మహిళపై హెల్మెట్‌తో దాడి చేశాడు. ఈ ఘటనకు సంబంధించి 33 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. దక్షిణ ముంబయిలో జరిగిన ఈ ఘటనలో బైక్‌పై వెళ్తున్న ఓ వ్యక్తి మహిళ కాలికి ఢీ కొట్టాడు. అయితే.. తనకు బైక్ తో తగలించినందుకు బైకర్ తో మహిళ గొడవకు దిగింది. దీంతో.. కోపంతో బైకర్ మహిళపై హెల్మెట్‌తో దాడికి పాల్పడ్డాడు. అక్కడున్న జనాలు ఈ ఘటనను చూసి బైకర్‌ను తీవ్రంగా కొట్టారు.

Read Also: Nipah virus: నిపా వైరస్‌తో కేరళలో ఒక వ్యక్తి మృతి..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బైక్ నడుపుతున్న వ్యక్తి పేరు షాహన్ ఆలం షేక్. కాగా.. మహిళపై దాడికి పాల్పడ్డాడనే ఆరోపణలతో శనివారం రాత్రి పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. నోటీసులిచ్చి షాహన్‌ను పోలీసులు విడుదల చేశారు. అయితే.. ఓ మహిళ ట్యాక్సీ కోసం వేచి ఉందని.. అదే సమయంలో బైక్ నడుపుతున్న వ్యక్తి మహిళ కాలిని ఢీ కొట్టాడు.. దీంతో, మహిళ అతనిని తిట్టింది. ఈ క్రమంలో.. కోపంతో షాహన్ ఆమెపై దాడి చేశాడు. గొడవ పెద్దదవడంతో మహిళను రోడ్డుపైకి తోసి హెల్మెట్‌తో తలపై దాడి చేశాడు.

Read Also: Indian Railway: భారతీయ రైల్వే రూల్స్ తెలుసా..! వీరికి టిక్కెట్లు అక్కర్లేదు

అనంతరం.. మహిళను దాడి చేయడాన్ని చూసిన స్థానికులు షాహాన్‌ను కొట్టారు. అతను తప్పించుకోవడానికి తాను పోలీసు అని చెప్పుకున్నాడు. కాగా.. మహిళ ఫిర్యాదు ఆధారంగా, ఇండియన్ జస్టిస్ కోడ్ (BNS) సెక్షన్ 79 మరియు 118 కింద షాహన్‌పై కేసు నమోదు చేశారు.