NTV Telugu Site icon

Viral Video: ఇంట్లోకి రాబోయి కిటికీలో ఇరుక్కుపోయిన కొండ చిలువ.. వీడియో వైరల్

Snake

Snake

ఇళ్లల్లోకి అప్పుడప్పుడు విషసర్పాలు వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు చిన్న చిన్న ప్రాణులు వస్తూ ఉంటే మరికొన్ని సార్లు భారీ పాములు, కొండ చిలువలు వస్తూ ఉంటాయి. వీటితో చాలా సందర్భాల్లో ప్రాణపాయం కూడా ఉంటుంది. ఇక అటవీ ప్రాంత సమీపంలోని గ్రామాల్లో అయితే ఇలాంటి సమస్య  మరీ ఎక్కువగా ఉంటుంది. ఈ మధ్య ఇలాంటి ఘటనలకు సంబంధించిన చాలా వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇళ్లలోకి భారీ పాము రావడం, అవి వాష్ రూమ్ లో దాగి ఉండటం, బెడ్స్ కింద ఉండటం ఇలా చాలా వీడియోలే సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. తాజాగా, ఓ పెద్ద కొండచిలువకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. చూడటానికే చాలా భయంకరంగా ఉన్న ఈ కొండ చిలువ ఇంట్లో దూరబోయి చిక్కుల్లో పడింది. మహారాష్ట్ర ముంబై లోని థానేలో ఈ ఘటన జరిగింది.

Also Read: Nepal T20I Records: టీ20ల్లో చరిత్ర సృష్టించిన నేపాల్.. హై స్కోర్, ఫాస్టెస్ట్ సెంచరీ, ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ!

ముంబై థానేలో స్థానికంగా ఉన్న ఓ భవనం వద్ద ఇటీవలి కాలంలో ఓ షాకింగ్ ఘటన జరిగింది. అక్కడ ఉన్న  అపార్ట్ మెంట్ లోకి వెళ్లేందుకు ఓ కొండ చిలువ ప్రయత్నించింది. అది 10 అడుగుల  పొడవు, భారీగా ఉంది. అది కిటికీలో నుంచి ఇంట్లోకి వెళ్లడానికి ప్రయత్నించింది. భారీగా ఉండటంతో అది కిటికీలో ఇరక్కు పోయింది. బయటకు రాలేక నానా తంటాలు పడింది. అయితే దాని దగ్గరకు వెళ్తే ఎక్కడ హాని జరుగుతుందో అని భయపడిన స్థానికులు వెంటనే స్నేక్ క్యాచర్లకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న ఇద్దరు వ్యక్తులు చాలా సేపు కష్టపడి ఆ కొండ చిలువను కాపాడారు. ఈ కొండచిలువ విషపూరితం కాని అల్బినో బర్మీస్ పైథాన్ జాతికి చెందినది వారు తెలిపారు. ఇలా వన్య ప్రాణులు అనుకోకుండా ఇంట్లోకి వస్తే వాటిని చంపకుండా తమకు వెంటనే సమాచారం అందించాలని వారు కోరారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఉన్న భారీ పామును చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. దానిని పట్టుకున్న వారు గ్రేట్ అంటూ పొగుడుతున్నారు.

Show comments