NTV Telugu Site icon

Rishikesh: 4 కాళ్లతో పుట్టిన శిశువు.. 8 గంటల పాటు ఆపరేషన్.. పరిస్థితి ఎలా ఉందంటే?

Rishikesh

Rishikesh

ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌ ఓ శిశువు నాలుగు కాళ్లు, వెన్నెముక పైభాగంలో భారీ వాపుతో జన్మించింది. తమ బిడ్డకు వికృతమైన పరిస్థితి దాపురించడంతో తల్లిదండ్రులు ఆవేదన చెందారు. మగ బిడ్డను 6 మార్చి 2024న రిషికేశ్‌లోని ఎయిమ్స్‌కి తీసుకొచ్చారు. ఇక్కడ పీడియాట్రిక్ సర్జరీ ఓపీడీలో అడ్మిట్ చేశారు. పీడియాట్రిక్ సర్జరీ విభాగం అధిపతి, మెడికల్ సూపరింటెండెంట్ ప్రొ. సత్యశ్రీ చిన్నారికి రెండు కాళ్లు మామూలుగానే ఉన్నాయని గుర్తించారు. మిగతా రెండు కాళ్లు అసాధారణ స్థితిలో ఉన్నాయని తెలిపారు. అంతే కాకుండా చిన్నారి వెన్నుముకపై పెద్దగా వాపు రావడం, ఒక్క కిడ్నీ మాత్రమే ఉందని వివరించారు.

READ MORE: YS Jagan Districts Tour: క్షేత్రస్థాయికి పర్యటనకు వైఎస్‌ జగన్‌.. వారంలో 2 రోజులు జిల్లాల్లోనే..

పీడియాట్రిక్ సర్జరీ విభాగానికి చెందిన డాక్టర్ ఇనోనో యోషు శస్త్రచికిత్స కోసం శిశువుని క్షుణ్ణంగా పరీక్షించి ఆపరేషన్‌కు సిద్ధం చేశారు. ఈ శస్త్రచికిత్స 8 గంటల పాటు కొనసాగింది. వెన్నుముకపై పెద్దగా వాపు, ఒక్క కిడ్నీ మాత్రమే ఉండటంతో సర్జరీ చాలా క్లిష్టంగా మారింది. ఎట్టకేలకు ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించారు. ఇందులో వివిధ విభాగాల వైద్యులు సహకరించారు. మూడు వారాల పాటు శిశువును అబ్జర్వేషన్‌లో ఉంచారు. ఎయిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రొ. మీనూ సింగ్ సర్జరీ చేసిన వైద్యుల బృందాన్ని ప్రశంసించారు. ఇది ఒక పెద్ద అచీవ్‌మెంట్ అని కొనియాడారు. ఈ సర్జరీలో పీడియాట్రిక్ సర్జరీ, పీడియాట్రిక్ డిపార్ట్‌మెంట్, ఆర్థోపెడిక్, ప్లాస్టిక్ సర్జరీ, న్యూరో సర్జరీ, ఇంటర్వెన్షన్ రేడియాలజీ, అనస్థీషియా టీమ్‌ల వైద్యులు పాల్గొన్నారు.

Show comments