NTV Telugu Site icon

AP Crime: 11 ఏళ్ల బాలికపై 65 ఏళ్ల వృద్ధుడు అత్యాచారయత్నం

Physical Harassment

Physical Harassment

AP Crime: ప్రస్తుత సమాజంలో ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోతోంది. నెలల వయసున్న చిన్నారి నుంచి వృద్ధుల వరకు వారిపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొస్తున్నా ఆడపిల్లలపై అత్యాచారాలు మాత్రం ఆగడం లేదు. చిన్నా పెద్దా తేడా లేకుండా దుర్మార్గులు అకృత్యాలకు ఒడిగడుతున్నారు. తాజాగా బాపట్ల పట్టణంలోని ఇందిరానగర్‌ కాలనీలో దారుణం చోటుచేసుకుంది. 11 ఏళ్ల బాలికపై 65 ఏళ్ల వృద్ధుడు అత్యాచారయత్నం చేశాడు. బాలిక బంధువుల ఫిర్యాదు మేరకు బాలికను పట్టణ పోలీసులు ప్రభుత్వ వైద్య శాలకు తరలించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Read Also: Maharashtra: భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పి డబ్బుల కోసం వేధింపులు.. భర్తపై కేసు నమోదు

ఇదిలా ఉండగా.. నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ మండలం పాత మెట్టపాలెంలో మైనర్ బాలికపై దూరపు బంధువు పెంచలయ్య అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక తండ్రి ఫిర్యాదుతో పెంచలయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చికిత్స కోసం బాలికను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తల్లి పద్మమ్మ ప్రోత్సాహంతోనే పెంచలయ్య అత్యాచారం చేశాడని బాలిక తండ్రి ఆరోపిస్తున్నాడు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Show comments