ఇండోనేషియాలోని సులవేసి ద్వీపంలోని గుహ పైకప్పుపై పంది వేటకు సంబంధించిన పురాతన పెయింటింగ్ కనుగొనబడింది. రాళ్లపై వేసిన 51,200 ఏళ్ల నాటి పెయింటింగ్ ఇది. ఈ గుహను సున్నపురాయితో నిర్మించారు. ఈ పురాతన కళాకృతిలో, పందులను చుట్టుముట్టి వేటాడే మానవుల బొమ్మలు గీశారు. ఇది ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన గుహ కళాఖండం. ఈ పెయింటింగ్ దక్షిణ సులవేసి ప్రావిన్స్‌లోని మారోస్-పాంగ్‌కెప్ ప్రాంతంలోని లియాంగ్ కరంపుయాంగ్ గుహలో ఉంది. ఇప్పుడు శాస్త్రవేత్తలు ఈ పురాతన కళాఖండాల వయస్సును తెలుసుకోవడానికి కాల్షియం కార్బోనేట్ స్ఫటికాల సహాయం తీసుకున్నారు. ఆస్ట్రేలియాలోని గ్రిఫిత్ యూనివర్శిటీకి చెందిన ఆర్కియాలజిస్ట్ మాగ్జిమ్ అబెర్ట్ మాట్లాడుతూ.. కొత్త సాంకేతికత మెరుగైన వయస్సును ఇస్తుందని చెప్పారు. ఈ పెయింటింగ్‌లో, ఒక పంది 36 అంగుళాల పొడవు, 15 అంగుళాల వెడల్పుతో ఉంటుంది. దీని చుట్టూ మానవులు ఉన్నారు. ఎరుపు రంగుతో ఈ పెయింటింగ్‌ను రూపొందించారు. ఈ గుహలో మరిన్ని పందుల చిత్రాలు ఉన్నాయి. ఈ పెయింటింగ్ పురాతన కాలంలో కథలు చెప్పడానికి ఉపయోగించినట్లు తెలుస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు.
READ MORE: CM Revanth Reddy: తెలంగాణ నిఘా విభాగాలకు నిధులు కేటాయించండి.. అమిత్ షాకు సీఎం వినతి
నాటి మానవులు జంతువులను ఎలా వేటాడేవారు అనే విషయాన్ని ఈ పెయింటింగ్ స్పష్టంగా చూపిస్తుంది. అయితే ఈ పెయింటింగ్ అసలు కథేమిటో దీన్ని కనిపెట్టిన శాస్త్రవేత్తలకు తెలియడం లేదు. అయితే దీన్ని బట్టి పూర్వం ఇక్కడ వేట జరుగుతోందని మనం ఊహించవచ్చు. అంతకుముందు, శాస్త్రవేత్తలు సులవేసిలోని లియాంగ్ బులు సిపాంగ్ 4 గుహలో పురాతన కళాఖండాలను కనుగొన్నారు. ఇందులో పంది వేటతో పాటు మరుగుజ్జు గేదె పెయింటింగ్ ను కూడా కనుగొన్నారు. ఇది దాదాపు 48 వేల సంవత్సరాల నాటి పెయింటింగ్. అయితే కొత్తగా కనుగొన్న పెయింటింగ్ పాత రికార్డును బద్దలు కొట్టింది. ఇది 51,200 సంవత్సరాల పురాతనమైనది.