Site icon NTV Telugu

Amritsar Golden Temple: గోల్డెన్ టెంపుల్‌లో యువతి ఆత్మహత్య.. ఏడో అంతస్తు నుంచి దూకి…

Golden Temple

Golden Temple

అమృత్‌సర్ గోల్డెన్ టెంపుల్ కాంప్లెక్స్‌లో 25 ఏళ్ల యువతి ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల సమాచారం ప్రకారం.. బాలిక గురుద్వారా బాబా అటల్ రాయ్ ఏడో అంతస్తు నుంచి దూకింది. ఈ ఘటన ఆలయ పరిసరాల్లో సంచలనం సృష్టించింది. పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. యువతి ఒంటరిగా దేవాలయానికి చేరుకుందని, ఆమె వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలపై కూడా ఆరా తీస్తున్నారు. యువతి మృతదేహాన్ని సివిల్‌ ఆస్పత్రి మార్చురీలో ఉంచినట్లు అదనపు డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ విశాల్‌జిత్‌ సింగ్‌ తెలిపారు. గోల్డెన్ టెంపుల్ కాంప్లెక్స్‌లో ఉన్న ఏడు అంతస్తులోని గురుద్వారా బాబా అటల్ రాయ్‌ని సందర్శించడానికి ఉ 7.30 నుంచి రాత్రి 10.30 వరకు అవకాశం కల్పిస్తున్నారు.

READ MORE: CM Chandrababu: సోషల్‌ మీడియాలో పోస్టులపై సీఎం సీరియస్‌.. ఆడబిడ్డల జోలికి వస్తే సహించేది లేదు..

అయితే ఈ యువతి ఉదయం 9.30 గంటల ప్రాంతంలో భవనం ఎక్కి ఏడో అంతస్తు నుంచి దూకింది. ఈ ఘటన తర్వాత తొక్కిసలాట జరిగింది. గురుద్వారా సాహిబ్ సేవకులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఆత్మహత్య చేసుకున్న యువతి గురించి వివరాలు తెలియరాలేదు. కానీ ఆమె వయస్సు సుమారు 25 సంవత్సరాలుగా ప్రాథమిక అంచనా వేశారు. ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆమె ఆలయానికి ఒంటరిగా వచ్చిందా లేక ఆమెతో పాటు మరెవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Exit mobile version